Oscars Welcomes Ram Charan : అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్ కు మరో అరుదైన గుర్తింపు, మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో టాలీవుడ్ అగ్ర హీరోకి చోటు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ది అకాడమి ఆఫ్ మోషన్ పిక్ఛర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ద్వారా ప్రకటించిన మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో రామ్ చరణ్ కు చోటు దక్కింది.

Ram Charan (Photo-ANI)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ది అకాడమి ఆఫ్ మోషన్ పిక్ఛర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ద్వారా ప్రకటించిన మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో రామ్ చరణ్ కు చోటు దక్కింది. తను వెండితెరపై తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని మెప్పించాడు.

చరణ్ అంకిత భావంతోనే కాకుండా తన హావభావాలతో సినీ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాడు. వాస్తవానికి , కల్పితానికి మధ్య వారధిగా నిలిచాడు. చరణ్ ఎన్నో సినిమాలకు తన నటనతో పాత్రలకు ప్రాణం పోశాడు. తన కళతో సాధారణ సినిమాలలో కూడా ప్రేక్షకకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నాడు.

అలాంటి వారిని యాక్టర్స్ బ్రాంచ్ లోకి ఆహ్వానిస్తున్నామని సోషల్ మీడియా వేదిక అకాడమీ ప్రతినిధులు పేర్కొన్నారు. 96 వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే సంవత్సరం మార్చిలో జరగనున్న సంగతి తెలిసిందే.

రజనీకాంత్‌‌కు గుడి కట్టి రోజూ పూజలు చేస్తున్న అభిమాని, గుడిలో అన్ని సూపర్ స్టార్ సినిమా పోస్టర్లే..స్టోరీ ఏంటో చూసేయండి మరి..

ప్రస్తుతం విడుదలైన అవార్డుల లిస్టులో రామ్ చరణ్ తో పాటు మరికొందరు హాలివుడ్ నటులు కూడా ఉన్నారు. దాంట్లో జూ. ఎన్టీఆర్ కు చోటు దక్కిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు రామ్ చరణ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమాతో హీరో రామ్ చరణ్,ఎన్టీఆర్ కు ఈ అరుదైన గౌరవం దక్కడంతో వారి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement