Pushpa 2 Grand National Press Meet: పుష్ప ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్, రేపు మెగా ప్రెస్ మీట్ పెడుతున్న చిత్ర యూనిట్, ఎందుకు అనేది మాత్రం సస్పెన్స్
మరో 46 రోజుల్లో దేశవ్యాప్తంగా ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) కౌంట్‌డౌన్ షురూ కానున్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు విన్నర్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పుష్ప ది రూల్’. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
Hyderabad, OCT 23: మరో 46 రోజుల్లో దేశవ్యాప్తంగా ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) కౌంట్‌డౌన్ షురూ కానున్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు విన్నర్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పుష్ప ది రూల్’. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే విడుదల తేదీ దగ్గరపడటంతో చిత్రబృందం భారీ ప్రెస్ మీట్‌ను (Pushpa Prss meet) ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది.
Pushpa 2 Grand National Press Meet Tomorrow
రేపు మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ జరుగనుండగా.. ఇందులో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారు అనేది క్లారిటీ లేదు. కానీ ఈ మూవీ విడుదల తేదీని డిసెంబర్ 05న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడానికి ఈ మీట్ పెడుతున్నట్లు సమాచారం. కాగా దీనిపై రేపు క్లారిటీ వస్తుంది.