Ticket Price Hiked For Daku Maharaj: బాలయ్య బాబు ‘డాకు మహారాజ్‌’ టికెట్ల రేటు పెంపు.. బెనిఫిట్‌ షో కూడా.. ఏపీ సర్కారు ఉత్తర్వులు

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‌’ సినిమా టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ చిత్రానికి బెనిఫిట్‌ షోతో పాటు 2 వారాల పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది.

Daku Maharaj (Credits: X)

Hyderabad, Jan 5: నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‌’ (Daku Maharaj) సినిమా టికెట్ల ధర (Ticket Price)) పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ చిత్రానికి  బెనిఫిట్‌ షోతో పాటు 2  వారాల పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ శనివారం ఉత్తర్వు లు జారీచేసింది. బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‌’ సినిమా ఈనెల 12న రానుంది. 12న ఉదయం 4 గంటలకు బెనిఫిట్‌ షో టికెట్‌ కు రూ.500 వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 2వారాల పాటు మల్టీప్లెక్స్‌ లో టికెట్‌ పై అదనంగా రూ.135, సింగిల్‌ స్ర్కీన్‌ లో రూ.110 పెంచేందుకు సమ్మతి తెలిపింది.

ఏపీలో గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. బెనిఫిట్‌ షోకు అనుమతి, తొలి రోజు 6 షోలకు అనుమతి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement