HC Stay On N Convention Demolition: ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే, కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు, నాగార్జునకు రిలీఫ్‌

తెలంగాణ హైకోర్టులో నటుడు నాగార్జునకు రిలీఫ్ లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై స్టే విధించింది న్యాయస్థానం. కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పు వెలువరిస్తామని చెప్పింది హైకోర్టు. దీంతో నాగ్‌కు రిలీఫ్ దక్కింది.

Big relief for Nagarjuna, High Court Stay on demolition of N convention

Hyd, Aug 24:  తెలంగాణ హైకోర్టులో నటుడు నాగార్జునకు రిలీఫ్ లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై స్టే విధించింది న్యాయస్థానం. కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పు వెలువరిస్తామని చెప్పింది హైకోర్టు. దీంతో నాగ్‌కు రిలీఫ్ దక్కింది.

ఇక ఇదే అంశంపై ఎక్స్ ద్వారా స్పందించారు నాగార్జున. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని, న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు. స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అని... మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు.

ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది.స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందని వెల్లడించారు. N కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున, కోర్టు ఆదేశాలకు విరుద్దంగా కూల్చివేత,ఒక్క అంగుళం కూడా ఆగ్రమించలేదు

Here's Tweet:

 కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు అని.... కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని తెలిపారు. ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం అని చెప్పారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement