Bigg Boss Season 8: నేడు బిగ్‌ బాస్ సీజన్ 8 కు ఎండ్ కార్డ్.. 300 మంది పోలీసులతో భారీ భద్రత.. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే..

ప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ నేటితో ముగియనుంది. దాదాపు వంద రోజులపాటు ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో విజేతను ఆదివారం రాత్రి ప్రకటించనున్నారు.

Big boss-police (Credits: X)

Hyderabad, Dec 15: ప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో (Star MAA TV) ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ (Bigg Boss Season 8) నేటితో ముగియనుంది. దాదాపు వంద రోజులపాటు ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో విజేతను ఆదివారం రాత్రి ప్రకటించనున్నారు. గత సీజన్‌ లో జరిగిన అవాంచిత ఘటనలను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్త చర్యగా జూబ్లీ హిల్స్‌ లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు నిర్ణయించారు.

అల్లు అర్జున్‌కు సీఎం చంద్రబాబు ఫోన్, అరెస్ట్‌పై ఆరా, బన్నీ ఇంటికి క్యూ కడుతున్న హీరోలు

అప్పుడు ఏం జరిగింది?

గతేడాది డిసెంబర్ 17న ముగిసిన బిగ్‌ బాస్-7లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. దీంతో స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన, అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బస్సులు, కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించిన హీరోయిన్ శ్రీలీల

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement