Rajat Patidar appointed as RCB New Captain(X)

Delhi, Feb 13:  ఐపీఎల్ 2025 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఆర్సీబీ జట్టు కొత్త కెప్టెన్‌ను(RCB captain) ప్రకటించింది. రజత్ పాటిదార్‌(Rajat Patidar) ను ఆర్సీబీ కెప్టెన్‌గా ఎంపిక చేసింది జట్టు యాజమాన్యం(Rajat Patidar Is RCB captain). ఇక పాటిదర్ ఎంపికపై హర్షం వ్యక్తం చేశాడు విరాట్ కోహ్లీ. జట్టు సభ్యులంతా అండగా ఉంటామని ప్రకటించాడు కోహ్లీ.

ఆర్సీబీ ఫ్రాంచైజీలో నువ్వు ఎదిగిన తీరు, ప్రదర్శించిన ఆటతీరు నిజంగా అద్భుతం అని కొనియాడాడు. నీ ఆటతో RCB అభిమానుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నావు.. కెప్టెన్‌గా ఇది నీకు మంచి గుర్తింపు అని వీడియోలో పేర్కొన్నాడు. ఇది పూర్తిగా నువ్వు అర్హమైన గుర్తింపు."

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్, మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం

డుప్లెసిస్ IPL 2024లో RCBకి కెప్టెన్‌గా వ్యవహరించాడు(RCB New Captain). ఓవరాల్‌గా పాటిదార్ ఆర్సీబీకి ఎనమిదవ కెప్టెన్. ఇంతకముందు రాహుల్ ద్రావిడ్, కేవిన్ పీటర్సన్, అనిల్ కుంబ్లే, డేనియల్ వెటోరి, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్‌లు పని చేశారు. RCB కెప్టెన్లలో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డు కుంబ్లేకు ఉంది. 35 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా పనిచేసిన కుంబ్లే.. 19 విజయాలు సాధించాడు.

Rajat Patidar appointed as RCB New Captain

IPL 2024 లో RCB ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. అయితే ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆర్సీబీ కప్ గెలవలేదు. 2009, 2011, 2016 సీజన్లలో పీటర్సన్, వెటోరి, కోహ్లీ నాయకత్వంలో రన్నరప్‌గా నిలిచింది ఆర్సీబీ.

Rajat Patidar as RCB New Captain