India players celebrating. (Photo credits: X/BCCI)

ఇంగ్లాండ్‌తో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో (IND vs ENG) టీమిండియా 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ (Team India) సరిగ్గా 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (112; 102 బంతులలో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (78; 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (52; 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4, మార్క్‌వుడ్ 2, సకిబ్, అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

నయా హిస్టరీ క్రియేట్ చేసిన శుబ్‌మన్ గిల్, కెట్‌లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు, 50 ఇన్నింగ్స్‌ల్లోనే మైల్‌స్టోన్‌

భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌కు శుభారంభం దక్కినా చివరకు ఆ జట్టు 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. టామ్ బాంటన్ (38), అట్కిన్సన్ (38; 19 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (23), బెన్ డకెట్ (34) పరుగులు చేశారు. జో రూట్ (24), హ్యారీ బ్రూక్ (19), బట్లర్ (6), లివింగ్‌స్టన్ (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.భారత బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్‌కు తలో వికెట్ దక్కింది.శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.