భారత క్రికెటర్, టీమిండియా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్(Shubman Gill) ఖాతాలో మరో కొత్త రికార్డు చేరింది. వన్డేల్లో అతి వేగంగా 2500 రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 50 ఇన్నింగ్స్‌లో గిల్ ఆ పరుగులు చేశాడు. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడవ వన్డేలో ఆ మైలురాయిని గిల్ అందుకున్నాడు.ఇంతకుముందు వరకు సౌతాఫ్రికా లెజెండ్ హషీమ్ ఆమ్లా టాప్‌లో ఉండేవాడు. ఇప్పుడు అతడ్ని దాటేశాడు టీమిండియా ఓపెనర్.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 92 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో సాయంతో గిల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్‌కు ఇది ఏడో వన్డే సెంచరీ కావడం విశేషం. 31 ఓవర్లకు భారత్ స్కోర్: 213/2. క్రీజులో గిల్(104)తో పాటు శ్రేయస్ అయ్యర్(48) ఉన్నాడు. ఇక విరాట్ కోహ్లీ 50 బంతుల్లో 50 రన్స్ చేశాడు. అతని హాఫ్ సెంచరీలో ఏడు ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. అయితే రషీద్ బౌలింగ్‌లో 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.వన్డేల్లో కోహ్లీ 73వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.తాజా సమాచారం ప్రకారం 31 ఓవర్లకు భారత్ స్కోర్: 213/2. క్రీజులో గిల్(104)తో పాటు శ్రేయస్ అయ్యర్(48) ఉన్నాడు.
Shubman Gill Becomes Fastest Batter To Reach 2500 One-Day International Runs
Stat Alert - Shubman Gill is now the fastest batter to 2500 runs in ODIs 💪💪
He gets to the mark in his 50th innings. #TeamIndia | @ShubmanGill pic.twitter.com/SJQ0Al7MUx
— BCCI (@BCCI) February 12, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)