Virat-Kohli

అహ్మదాబాద్‌ వన్డే సందర్భంగా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli) అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. కాగా కోహ్లి ఇంగ్లండ్‌పై ఇప్పటి వరకు ఎనిమిది శతకాలు బాదడంతో పాటు 23 హాఫ్‌ సెంచరీలు కూడా చేశాడు. సగటు 41.23.ఓవరాల్‌గా ఈ జాబితాలో విరాట్ కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో మెరుపులు మెరిపిస్తాడనుకున్న విరాట్‌ కోహ్లి 52 పరుగులు చేసిన కోహ్లి.. అదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

కాగా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక అయింది. ఇందులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

స్లిప్‌లో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న స్టీవ్ స్మిత్, ఒంటి చేత్తో అలా డైవింగ్ చేస్తూ పట్టుకున్న వీడియో ఇదిగో..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు

1. డాన్‌ బ్రాడ్‌మన్‌(ఆస్ట్రేలియా)- 63 ఇన్నింగ్స్‌లో 5028 పరుగులు

2. అలెన్‌ బోర్డర్‌(ఆస్ట్రేలియా)- 124 ఇన్నింగ్స్‌లో 4850 పరుగులు

3. స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా)- 114 ఇన్నింగ్స్‌లో 4815 పరుగులు

4. వివియన్‌ రిచర్డ్స్‌(వెస్టిండీస్‌)- 84 ఇన్నింగ్స్‌లో 4488 పరుగులు

5. రిక్కీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా)- 99 ఇన్నింగ్స్‌లో 4141 పరుగులు

6. విరాట్‌ కోహ్లి(ఇండియా)-109 ఇన్నింగ్స్‌లో 4001కి పైగా పరుగులు.

Kohli Becomes First Indian To Make 4,000 International Runs Against England