
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) (177; 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) పరుగుల విధ్వంసం సృష్టించాడు. దీంతో అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఈ తుఫాను ఇన్సింగ్స్ తో జద్రాన్.. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ (165) పేరిట ఉన్న రికార్డును జద్రాన్ తిరగరాశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (6), సెదికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (41), మహ్మద్ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో (ICC Champions Trophy) సూపర్ సెంచరీతో జద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ (177) నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ ఆస్ట్రేలియాపై 165 పరుగులు స్కోర్ చేశాడు. దీంతో పాటుగా వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2022లో శ్రీలంకతో జరిగిన వన్డేలో జద్రాన్ 162 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌కు ముందు వరకు వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండింది. ఈ సెంచరీతో జద్రాన్ రెండు ఐసీసీ వన్డే ఈవెంట్లలో సెంచరీలు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటుగా పాక్ గడ్డపై నాలుగో అత్యధిక వన్డే స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాక్ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన ఘనత గ్యారీ కిర్‌స్టన్‌కు దక్కుతుంది. 1996 వరల్డ్‌కప్‌లో కిర్‌స్టన్ యూఏఈపై 188 పరుగులు (నాటౌట్) చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..
ఇబ్రహీం జద్రాన్-177
బెన్ డకెట్-165
నాథన్ ఆస్టల్-145 నాటౌట్
ఆండీ ఫ్లవర్-145
సౌరవ్ గంగూలీ-141 నాటౌట్
సచిన్ టెండూల్కర్-141
గ్రేమీ స్మిత్-141
పాకిస్తాన్ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్లు..
గ్యారీ కిర్‌స్టన్-188 నాటౌట్
వివియన్ రిచర్డ్స్-181
ఫకర్ జమాన్-180 నాటౌట్
ఇబ్రహీం జద్రాన్-177
బెన్ డకెట్-165
ఆండ్రూ హడ్సన్-161
వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..
ఇబ్రహీం జద్రాన్-177 వర్సెస్ ఇంగ్లండ్, 2025
ఇబ్రహీం జద్రాన్-162 వర్సెస్ శ్రీలంక, 2022
రహ్మానుల్లా గుర్భాజ్-151 వర్సెస్ పాకిస్తాన్, 2023
అజ్మతుల్లా ఒమర్‌జాయ్-149 నాటౌట్ వర్సెస్ శ్రీలంక, 2024
రహ్మానుల్లా గుర్భాజ్-145 వర్సెస్ బంగ్లాదేశ్, 2023