Virus (Image Credits: Pixabay)

Bengaluru, Jan 6: చైనాలో (China) బయటపడి అక్కడ కలవరం సృష్టిస్తున్న కొత్త వైరస్ (New Virus) హెచ్ఎంపీవీ (HMPV) భారత్ లోకి ప్రవేశించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో తొలి కేసు నమోదైంది. ఎనిమిది నెలల పాపకు ఈ వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో బయటపడింది. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం సైతం నిర్ధారించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓ ప్రైవేట్ ల్యాబ్ లో నిర్వహించిన వైద్య పరీక్షలో పాపకు వైరస్ సోకినట్లు తేలిందని సమాచారం.

‘ఫార్ములా-ఈ’ కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్.. రేపు ఈడీ విచారణ కూడా..

భయందోళనలు రెట్టింపు

ఇప్పటి వరకూ చైనా, జపాన్ లకే పరిమితమైన ఈ కొత్త వైరస్  భారత్ లోనూ వెలుగు చూడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పాపకు వైరస్ ఎలా సోకిందనే వివరాలు ఇంకా తెలియరాలేదని, వైరస్ స్ట్రైయిన్ వైద్య నిపుణులకు అంతుబట్టడంలేదని కర్ణాటక వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

కొండపైకి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి.. తిరుమలలో ఘటన

ఇవే లక్షణాలు

ఈ వైరస్ సోకిన వారిలో ఫ్లూ తరహాలో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రధానంగా పదకొండు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులలోనే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు చైనా వైద్య నిపుణులు చెబుతున్నారు.