KTR Key Comments On Rythu Bharosa, slams cm revanth reddy(X)

Hyderabad, Jan 6: ఫార్ములా-ఈ కారు రేసులో (Formula-E Car Race) కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ (BRS) కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను నేడు ఏసీబీ విచారించనుంది. ఉదయం పది గంటలకు ఆయన అధికారుల ఎదుట హాజరుకానున్నారు. కాగా, తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ పై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. అయితే, తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని, కాకపోతే విచారణను మాత్రం కొనసాగించవచ్చని కోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో 6న ఉదయం 10 గంటలకు విచారణకు రావాల్సిందిగా కేటీఆర్‌ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది.

కొండపైకి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి.. తిరుమలలో ఘటన

ఈడీ ముందు కూడా

ఇదే ఫార్ములా-ఈ కారు రేసు కేసులో రేపు (7న) తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేటీఆర్‌ కు సమన్లు జారీచేసింది. మరి ఆయన రేపు ఈడీ ముందు హాజరు అవుతారా? లేదా? అని తెలియాల్సి ఉంది.

సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో, కిరణ్‌కుమార్‌ అంటూ స్టేజి మీదకు ఆహ్వానించడంతో ఒక్కసారిగా గందరగోళం