Representative Image

Tirumala, Jan 6: తిరుపతి (Tirupati) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం నరశింగాపురం వద్ద తిరుమల (Tirumala) కొండ మీదకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి ఓ 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో ముగ్గరికి గాయాలయ్యాయి. మదనపల్లి నుంచి తిరుపతి రూయా ఆస్పత్రికి అంబులెన్స్‌ లో ఓ రోగిని తీసుకొస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక దవాఖానలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో, కిరణ్‌కుమార్‌ అంటూ స్టేజి మీదకు ఆహ్వానించడంతో ఒక్కసారిగా గందరగోళం

మృతులు వీళ్లే

మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన రెడ్డమ్మ, లక్ష్మమ్మగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో అపశృతి, పెంబర్తి కళాతోరణం వద్ద బోళ్తా పడ్డ పోలీస్ వాహనం..ఎస్సై,డైవర్లకు స్వల్ప గాయాలు