Prabhas: రాంలీలా మైదానంలో జరిగే రావణ దహనం కార్యక్రమానికి ప్రభాస్ కు ఆహ్వానం.. హాజరుకానున్న డార్లింగ్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దసరా రోజు జరిగే రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొననున్నాడు. గతంలోనే ఈ విషయంపై వార్తలు రాగా అయోధ్యలో జరిగిన టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో అఫీషియల్‌ అనౌన్స్‌ మెంట్ వచ్చింది.

Ram (Photo Credits: Twitter)

NewDelhi, October 3: పాన్ ఇండియా (PanIndia) స్టార్ ప్రభాస్‌కు (Prabhas) అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది ఢిల్లీలోని (Delhi) రాంలీలా (RamLeela) మైదానంలో దసరా (Dassera) రోజు జరిగే రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొననున్నాడు. గతంలోనే ఈ విషయంపై వార్తలు రాగా అయోధ్యలో (Ayodhya) జరిగిన టీజర్ లాంచింగ్ (Teaser Launching) కార్యక్రమంలో అఫీషియల్‌ అనౌన్స్‌ మెంట్ (Official Announcement) వచ్చింది. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ (Om Raut) మాట్లాడుతూ.. రావణ దహన కార్యక్రమంలో తనతో పాటు ప్రభాస్ పాల్గొంటాడని ప్రకటించాడు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఇప్పటికే ప్రభాస్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రాంలీలా మైదానంలో అక్టోబర్‌ 5న విజయ దశమి వేడుకలు జరగనున్నాయి.

‘దృశ్యం’ సినిమాను తలపించేలా మరో హత్య .. బావమరిదిని చంపి ఇంట్లో పాతిపెట్టి నున్నగా ఫ్లోరింగ్ చేసిన బావ.. విషయం ఎలా బయటపడిందంటే??

కాగా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా దసరా వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మను కాల్చివేస్తారు. రాంలీలా మైదానంలో ఈ ఏడాది జరిగే దసరా వేడుకలకు అయోధ్యలోని రామ మందిరం రూపంలో నిర్వాహకులు మండపాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి ఏటా ఒక్కో థీమ్‌తో మండపాన్ని నిర్మించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది రావణదహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆదిపురుష్‌ చిత్రంలో శ్రీ రాముడి పాత్రను పోషిస్తున్న ప్రభాస్ కంటే గొప్పవారు ఎవరుంటారని.. అందుకే ప్రభాస్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement