Heavy rain lashes several parts of Delhi and Bihar, Punjab(X)

Delhi, Mar 1:  దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది(Delhi weather). పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేని వర్షం కురియడంతో రోడ్లన్నీ చెరువులను(Delhi Rains) తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్కపోతతో ఢిల్లీ ప్రజలు అల్లాడిపోయారు. జాతీయ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 26.7 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా ఢిల్లీలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 11.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో వర్షపాతం గత ఏడాదితో పోలిస్తే తక్కువగా ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నాలుగు రోజుల పాటు వర్షపాతం నమోదవ్వగా, 2024లో ఆరు వర్షపాత రోజులు నమోదయ్యాయి.

మద్యం మత్తులో యువతి హల్ చల్.. బైక్‌పై ఇద్దరు యువకుల మధ్య కూర్చొని రోడ్డుపై నానా రచ్చ, వైరల్‌గా మారిన వీడియో

మార్చి నెలలో సాధారణం కన్నా ఎక్కువగా వేడిగా ఉండే అవకాశం ఉందని, దీంతో పాటు వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్చి నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. అయితే, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కన్నా తక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.

Heavy rain lashes several parts of Delhi 

ఇక ఢిల్లీలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం(Heavy rain lashes) పడుతుండటంతో ఉద్యోగాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు, హిమపాతం బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లో కుండపోత వర్షాలతో రహదారులు మూసివేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Heavy rain lashes several parts of Delhi 

 Heavy rain lashes several parts of Delhi and Bihar, Punjab

Heavy rain lashes several parts of Punjab