Jr NTR Corona Positive: జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్, ఫ్యామిలీ అంతా ఐసోలేషన్‌లో ఉన్నామని తెలిపిన యంగ్ టైగర్, త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రార్థనలు

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతూ.. ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కొవిడ్ 19 బారిన పడ్డాను. దయచేసి ఎవరూ బాధపడకండి. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నాము.

Jr NTR (Photo Credits: Twitter)

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతూ.. ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కొవిడ్ 19 బారిన పడ్డాను. దయచేసి ఎవరూ బాధపడకండి. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నాము.

కొద్దిరోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారంతా.. టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ క్షేమంగా ఉండండి..’’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.కాగా తనకు కరోనా పాజిటివ్ అని జూనియర్ చేసిన ట్వీట్ పై కొద్దిసేపట్లోనే స్పందనలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, సినీ ప్రముఖులు సందేశాలు పంపిస్తున్నారు.

ఎన్టీఆర్ ట్వీట్ చూసిన వారంతా.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ.. జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలుకుని, క్షేమంగా బయటికి రావాలని ఆయన అభిమానులు పూజలు జరుపుతున్నట్లుగా కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

Here's NTR Tweet

కొన్ని రోజులుగా ఈయన బయటికి రావడం లేదు. నిజానికి కరోనా రాకముందు నుంచి కూడా ఈయన క్వారంటైన్‌లోనే ఉన్నాడు. తన స్టాఫ్‌లో కొందరికి పాజిటివ్ రావడంతో ఐసోలేట్ అయిపోయాడు జూనియర్. ఇప్పుడు ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ట్రిపల్ ఆర్‌తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొరటాల, బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ లైన్‌లో ఉన్నారు.

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement