Kalki Ticket For Rs 100 Only: క‌ల్కీ మూవీ టికెట్ కేవ‌లం రూ.100 మాత్ర‌మే, దేశ‌వ్యాప్తంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన వైజ‌యంతి మూవీస్

కల్కి మూవీని రూ.100 కే చూడొచ్చున‌ని ప్ర‌క‌టించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే కాదండోయ్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేట‌ర్ల‌లో చూడొచ్చున‌ని చెప్పింది. అయితే.. ఈ ఆఫ‌ర్ ఆగ‌స్టు 2 నుంచి 9 వ‌ర‌కు మాత్ర‌మే వ‌ర్తించ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

Kalki Ticket For Rs 100 Only

Hyderabad, AUG 02: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ (Prabhas) హీరోగా న‌టించిన చిత్రం ‘కల్కి 2898AD’ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. థియేట‌ర్ల వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. రూ.1100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ఎప్పుడో ప్ర‌క‌టించింది. ఇక తాజాగా మూవీ యూనిట్ ఓ అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను తీసుకువ‌చ్చింది.

 

కల్కి మూవీని రూ.100 కే చూడొచ్చున‌ని ప్ర‌క‌టించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే కాదండోయ్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేట‌ర్ల‌లో చూడొచ్చున‌ని చెప్పింది. అయితే.. ఈ ఆఫ‌ర్ ఆగ‌స్టు 2 నుంచి 9 వ‌ర‌కు మాత్ర‌మే వ‌ర్తించ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ లు కీల‌క పాత్ర‌లు పోషించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement