Kantara Chapter 1 Release Date: కాంతారా చాప్ట‌ర్ -1 రిలీజ్ డేట్ వ‌చ్చేసింది, ఏకంగా రూ. 120 కోట్ల‌తో భారీ స్కెచ్ వేసిన రిష‌బ్

ఇప్పటికే లాంఛ్ చేసిన కాంతార చాఫ్టర్‌ 1 ఫస్ట్ లుక్‌, టీజ‌ర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్‌ను షేర్ చేశారు

Kantara Chapter 1 Release Date

Bangalore, NOV 17: టాలెంటెడ్‌ క‌న్నడ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ రిషబ్‌​శెట్టి (Rishab Shetty) దర్శకత్వంలో ‘కాంతార’ ఏ రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరోసారి ట్రెండ్‌ సృష్టించేందుకు కాంతార ప్రీక్వెల్‌ కాంతార చాప్టర్ -1 (Kantara: Chapter 1) కూడా వస్తుందని తెలిసిందే. ఇప్పటికే లాంఛ్ చేసిన కాంతార చాఫ్టర్‌ 1 ఫస్ట్ లుక్‌, టీజ‌ర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్‌ను షేర్ చేశారు మేకర్స్‌.

Kantara Chapter 1 Release Date

 

ఈ చిత్రాన్ని 2025 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్‌. తొలిపార్టును రూ.16 కోట్లలోపే నిర్మించిన రిషబ్ శెట్టి‌.. ప్రీక్వెల్‌ కోసం రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌.  ప్రీక్వెల్‌ను కూడా హొంబలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తుండ‌గా.. కాంతార తర్వాత మరోసారి అజనీష్‌ లోకనాథ్ మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement