Pushpa Re-Release: కోటి రూపాయ‌లు కూడా వ‌సూలు చేయ‌లేక చ‌తికిలాప‌డ్డ‌ పుష్ప‌, హిందీ వ‌ర్ష‌న్ మూవీ రిలీజ్ విష‌యంలో అల్లు అర్జున్ కు ఎదురుదెబ్బ‌

రీరిలీజ్‌ ట్రెండ్‌లో కరణ్‌ అర్జున్‌, పుష్ప రెండూ నిరాశపర్చాయి. ఇకపోతే షారూఖ్‌ ఖాన్‌ 'కల్‌ హో నా హో' (Kal Ho Na Ho) సినిమా కూడా నవంబర్‌ 15న రీరిలీజ్‌ అవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.3.70 కోట్లు వసూలు చేసింది.

Pushpa (photo-Twitter)

Mumbai, NOV 27: క్లాసిక్‌, బ్లాక్‌బస్టర్‌ సినిమాలను మళ్లీ రిలీజ్‌ చేయడం ఇప్పుడు ప్యాషన్‌ అయిపోయింది. అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌ హిట్‌ మూవీ పుష్పను (Pushpa) ఇటీవలే మళ్లీ విడుదల చేశాడు. నవంబర్‌ 22 నుంచి ఈ మూవీ హిందీ వర్షన్‌ థియేటర్లలో ఆడుతోంది. దీనితో పాటు హిందీ కల్ట్‌ క్లాసిక్‌ కరణ్‌ అర్జున్‌ (Karan Arjun) కూడా ఒకేరోజు రిలీజైంది. షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వారం రోజుల్లో రూ.1 కోటి వసూలు చేసింది. పుష్ప కేవలం రూ.70 లక్షలు మాత్రమే రాబట్టింది. రీరిలీజ్‌ ట్రెండ్‌లో కరణ్‌ అర్జున్‌, పుష్ప రెండూ నిరాశపర్చాయి. ఇకపోతే షారూఖ్‌ ఖాన్‌ 'కల్‌ హో నా హో' (Kal Ho Na Ho) సినిమా కూడా నవంబర్‌ 15న రీరిలీజ్‌ అవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.3.70 కోట్లు వసూలు చేసింది.

Allu Arjun Craze in Kerala: కేర‌ళ‌లో అల్లు అర్జున్ క్రేజ్ చూస్తే మ‌తి పోవాల్సిందే! మ‌ల్లు అర్జున్ అంటూ వెలిసిన పోస్ట‌ర్లు, వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన ఫ్యాన్స్ 

ఇకపోతే అల్లు అర్జున్‌ పుష్ప 2 (Pushpa 2) మూవీ డిసెంబర్‌ 5న విడుదల కానుంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement