Kartikeya Marriege:ఓ ఇంటివాడైన ఆర్ఎక్స్ 100 హీరో, ఘనంగా హీరో కార్తికేయ వివాహ వేడుక, ఆశీర్వదించిన మెగాస్టాన్ చిరంజీవి, పలువురు సినీ ప్రముఖులు

టాలీవుడ్‌ నటుడు, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు లోహిత మెడలో మూడుముళ్లు వేశాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.

Hyderabad November 21: టాలీవుడ్‌ నటుడు, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు లోహిత మెడలో మూడుముళ్లు వేశాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌, తనికెళ్ల భరణి, అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

బీటెక్‌ చదువుతున్న రోజుల్లోనే కార్తికేయకు లోహితతో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే హీరోగా రాణించాలనే ఉద్దేశంతో కార్తికేయ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇన్నాళ్ల తమ ప్రేమలో మరో అడుగు ముందుకు వేయబోతున్నామని ఇటీవలే కార్తికేయ ప్రకటించాడు. తనకు కాబోయే భార్యకు ఓ సినీ వేడుకలో ప్రపోజ్‌ చేశాడు.

‘ఆర్‌ఎక్స్‌ 100’తో మంచి మార్కులు కొట్టేసి.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నారు కార్తికేయ. ఇటీవల ఆయన నటించిన ‘రాజా విక్రమార్క’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. అజిత్‌ హీరోగా నటించిన వలిమై చిత్రంలో కార్తికేయ కీ రోల్‌ పోషించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement