Bheemla Nayak: భీమ్లానాయక్‌ మూడో సాంగ్ రిలీజ్, పూనకాల్లో ఫ్యాన్స్, పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

పవర్‌స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. భీమ్లానాయక్ నుంచి రిలీజ్‌ అయిన లా..లా.. సాంగ్ చూసి పూనకాల్లో మునిగిపోయారు. పవన్‌ కల్యాణ్ పవర్‌ఫుల్ లుక్, తమన్ రఫ్ఫాడించే మ్యూజిక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Hyderabad November 07: పవర్‌స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. భీమ్లానాయక్ నుంచి రిలీజ్‌ అయిన లా..లా.. సాంగ్ చూసి పూనకాల్లో మునిగిపోయారు. పవన్‌ కల్యాణ్ పవర్‌ఫుల్ లుక్, తమన్‌ రఫ్ఫాడించే మ్యూజిక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ భీమ్లానాయక్‌. మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్‌ కోషియం రీమేక్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ బయటకు వచ్చింది. సౌండ్‌ ఆఫ్‌ భీమ్లానాయక్‌ పేరుతో మూడో పాటను విడుదల చేశారు.

లా..లా భీమ్లా.. అడవి పులి.. గొడవపడి అంటూ సాగే పాట సినిమాలో పవన్‌కల్యాణ్‌ పాత్రను తెలియజేసేలా రూపొందించారు. దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ పాటను రచించారు. సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ స్వరాలు అందించగా అరుణ్ కౌండిన్య పాటను మరింత పవర్‌ఫుల్‌గా ఆలపించారు.

 

విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ సాంగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో నటుడు రానా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన డేనియల్‌ శేఖర్‌గా కనిపించనున్నారు. రానాకు జోడీగా సంయుక్త మేనన్‌, పవన్‌కు జోడీగా నిత్యామీనన్‌ సందడి చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement