MAA Elections 2021: నేటితో మా ఎన్నికల నామినేషన్ పర్వానికి తెర, అక్టోబర్ 10న ఎన్నికలు, ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు మ‌ధ్య ప్రధాన పోటీ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు సాధార‌ణ ఎల‌క్ష‌న్స్‌ని (MAA Elections 2021) త‌ల‌పిస్తున్నాయి. అధ్యక్షులు, ప్యానెల్ స‌భ్యులు ప్ర‌త్య‌ర్ధుల‌పై మాట‌ల దాడులు చేస్తున్నారు. అక్టోబర్ 10న జ‌ర‌గ‌నున్న పోటీలో ఎవ‌రు గెలుస్తారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది

MAA Elections 2021 (Photo-Twitter)

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు సాధార‌ణ ఎల‌క్ష‌న్స్‌ని (MAA Elections 2021) త‌ల‌పిస్తున్నాయి. అధ్యక్షులు, ప్యానెల్ స‌భ్యులు ప్ర‌త్య‌ర్ధుల‌పై మాట‌ల దాడులు చేస్తున్నారు. అక్టోబర్ 10న జ‌ర‌గ‌నున్న పోటీలో ఎవ‌రు గెలుస్తారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. నేటితో మా ఎన్నిక‌ల నామినేష‌న్ ప‌ర్వం (Nominations closed today) ముగుస్తుంది.

అయితే ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు మ‌ధ్య పోటీ ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, వీరిరివురు ఇప్ప‌టికే నామినేష‌న్స్ వేశారు. అక్టోబర్ 10 (elections to be held on October 10) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ‘మా’ ఎన్నికలు జరుగుతాయి. ఆరోజు సాయంత్రమే ఫలితాలు వెలువడతాయి. ఈసారి ‘మా’ అధ్యక్ష పదవికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహ రావు పోటీ పడుతుండ‌గా, ఈ ముగ్గురితో పాటు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ కూడా నామినేషన్ వేశారు.

నువ్వు సైకోవి పవన్, రేపే నీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా, జనసేనాధినేతపై మండిపడిన పోసాని కృష్ణమురళి, టీడీపీ శ్రేణులు చిరంజీవిని తిట్టినప్పుడు ఎక్కడున్నావు అంటూ ఫైర్

రేపు నామినేషన్‌లను పరిశీలిస్తారు. అక్టోబర్ 1, 2 తేదీలు నామినేషన్ ఉపసంహరణకు ఆఖరి గడువుగా తెలియ‌జేశారు. పోటాపోటీగా ప్ర‌చారాలు చేస్తుండ‌గా, ఎవ‌రికి వారు త‌మ గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ‘మా’ ఎన్నికలు జరుగుతాయి. ఆరోజు సాయంత్రమే ఫలితాలు వెలువడతాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో, ఫోటోలు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Advertisement
Advertisement
Share Now
Advertisement