Aparna Nair Dies by Suicide: సినీ ఇండస్ట్రీలో మరో ఆత్మహత్య, రాత్రి పొద్దుపోయాక ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న ప్రముఖ నటి అపర్ణ నాయర్

మలయాళం ఇండస్ట్రీలో తీవ్ర విషాం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ, సినీనటి అపర్ణ నాయర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న రాత్రి పొద్దుపోయాక తిరువనంతపురంలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.

Aparna Nair dies by suicide at 33 (Photo-InstagraM)

మలయాళం ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మళయాల టీవీ, సినీనటి అపర్ణ నాయర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న రాత్రి పొద్దుపోయాక తిరువనంతపురంలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న సాయంత్రం 7.30 గంటల సమయంలో సీలింగుకి వేలాడుతున్న అపర్ణను చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జోథా అక్బర్ ఆర్ట్ డైరక్టర్‌ నితిన్ దేశాయ్ ఆత్మహత్య, సొంత స్డూడియోలో ఉరేసుకున్న ఫేమస్‌ ఆర్ట్ డైరక్టర్, ఐదుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న నితిన్ దేశాయ్

ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సమస్యలే ఆమె మృతికి కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అపర్ణ ఆత్మహత్యకు 11 గంటల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు.

Her Last Post

 

View this post on Instagram

 

A post shared by aparna nair official (@aparna_nair_actress)

33 ఏళ్ల అపర్ణ పలు సీరియళ్లతోపాటు కొన్ని సినిమాల్లోనూ నటించారు. పలు సూపర్ హిట్ సీరియళ్లలో నటించి పేరు తెచ్చుకున్న అపర్ణ నాలుగైదు సినిమాల్లోనూ నటించారు. ఆమె ఆత్మహత్య విషయం తెలిసి ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ కూడా సరిగ్గా నెల రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement