Nitin Desai Dies By Suicide

Mumbai, Aug 02:  ప్రముఖ సినీ ఆర్ట్ డైరక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య (Nitin Desai Dies By Suicide) చేసుకున్నారు. ముంబై సమీపంలోని కర్‌జట్‌లో ఉన్న ఎన్‌డీ స్టూడియోస్‌ లో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టూడియోలోని ఓ రూంలో నితిన్ దేశాయ్ ఉరేసుకున్నారు. 20 ఏళ్లుగా బాలీవుడ్‌లో ఫేమస్ ఆర్ట్ డైరక్టర్‌గా (Nitin Desai Dies By Suicide) ఉన్న నితిన్ దేశాయ్ ఆత్మహత్య బాలీవుడ్‌ను షాక్ కు గురిచేసింది. లగాన్, జోథా అక్బర్, దేవదాస్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, హమ్ దిల్‌ దే చుకే సనమ్ వంటి హిట్ మూవీస్‌ కు ఆయన ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేశారు.  నితిన్ దేశాయ్ పూర్తిపేరు నితిన్ చంద్రకాంత్ దేశాయ్. ఆర్ట్ డైరక్టర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్ గా అనేక టెలివిజన్ కార్యక్రమాలు కూడా చేశారు నితిన్.

అంతేకాదు ప్రొడ్యూసర్‌గా మారి ఆయన చంద్రకాంత్ ప్రొడక్షన్స్ స్థాపించారు. ఆ బ్యానర్‌ ఓల దేశ్‌ దేవీ అనే భక్తి చిత్రాన్ని నిర్మించారు. బెస్ట్ ఆర్ట్ డైరక్టర్‌గా నాలుగుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు నితిన్ దేశాయ్. 52 ఎకరాల్లో ఎన్‌డీ స్డూడియోస్‌ ను ఏర్పాటు చేసిన ఆయన...అందులోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిగ్‌ బాస్‌ (Bigg Boss) హిందీ ప్రొగ్రాంకు కూడా నితిత్ దేశాయ్‌ ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేశారు.