Balamurugan Passes Away: ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూత
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ (85) కన్నుమూశారు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా పనిచేసిన ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు, రచయిత భూపతి రాజా తెలిపారు.
Chennai, Jan 16: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ (85) (Balamurugan) కన్నుమూశారు. తెలుగు (Telugu), తమిళం (Tamil) సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా (Writer) పనిచేసిన ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు, రచయిత భూపతి రాజా తెలిపారు.
బాలమురుగన్ తెలుగులో ధర్మదాత, సోగ్గాడు, ఆలుమగలు, సావాసగాళ్లు, జీవన తరంగాలు వంటి హిట్ సినిమాలకు కథ అందించారు. గీతా ఆర్ట్స్ తొలిసారి నిర్మించిన ‘బంట్రోతు భార్య’ సినిమాకు కూడా ఆయనే కథ అందించారు. తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేశన్‌కు దాదాపు 40 కథల వరకు అందించారు. బాలమురుగన్ మృతి వార్త తెలిసిన తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement