Credits: Video Grab

Islamabad, Jan 16: పాకిస్థాన్‌లో (Pakistan) ఆహార సంక్షోభం (Food Crisis) కట్టలు తెంచుకున్నది. కడుపు నింపుకునేందుకు పౌరులు (People) పడరాని పాట్లు పడుతున్నారు. గోధుమ పిండి (wheat flour) లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కును (Truck) చూసిన వందలాదిమంది పిండిని కొనుగోలు చేసేందుకు దానిని బైకులతో (Bikes) వెంబడించారు. ప్రాణాలకు తెగించి ఇద్దరు వ్యక్తులు ట్రక్కు వెనకభాగంలోకి ఎక్కడం వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

వన్డేల్లో చరిత్ర సృష్టించిన భారత్, భారీ తేడాతో శ్రీలంకపై విజయం, మూడో వన్డేలో దుమ్మురేపిన టీమిండియా బ్యాట్స్ మెన్, బౌలర్లు

సజ్జద్ రజా అనే ప్రొఫెసర్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇది బైక్ ర్యాలీ కాదని, గోధుమ పిండి కోసం పాక్ ప్రజలు పడుతున్న కష్టాలకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్  ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు. తాను పాకిస్థానీ కానందుకు సంతోషిస్తున్నట్టు పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో భవిష్యత్తు ఉందని ఇప్పటికీ భావిస్తున్నారా? అని ఆ ట్వీట్‌లో జమ్మూకశ్మీర్ ప్రజలను ప్రశ్నించారు.

నేపాల్‌లో కుప్పకూలిన విమానం, ప్రమాద సమయంలో విమానంలో 72 మంది, 5గురు భారతీయులు సహా మొత్తం 15 మంది విదేశీయులు