Pune, Jan 16: ఎన్సీపీ (NCP) నేత అజిత్ పవార్ (Ajit Pawar) త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరో ముగ్గురితో కలిసి అజిత్ పవార్ నాలుగో అంతస్తులో లిఫ్ట్ (Lift) ఎక్కగా, అది ఒక్కసారిగా వేగంగా కిందికి జారి పడింది.. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూణెలోని (Pune) హార్దికర్ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన.
బారామతిలో తాను ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్టు అజిత్ పవార్ తెలిపారు. ప్రమాద సమయంలో తనతోపాటు 90 ఏళ్ల వైద్యుడు డాక్టర్ రెడీకర్, పోలీసులు కూడా లిఫ్ట్ లో ఉన్నట్టు చెప్పారు. తాము లిఫ్ట్ లోకి వెళ్లిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఆ వెంటనే లిఫ్ట్ నాలుగో అంతస్తు నుంచి వేగంగా కిందపడిందని వివరించారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందన్నారు. ఆ తర్వాత లిఫ్ట్ డోర్‌ను బద్దలుగొట్టడంతో తామంతా సురక్షితంగా బయటపడినట్టు తెలిపారు.
Nationalist Congress Party leader Ajit Pawar had a narrow escape from a freaky lift mishap in Maharashtra's Pune. (By @Pkhelkar)https://t.co/e3CAARMdgQ
— IndiaToday (@IndiaToday) January 15, 2023