Prabhas Marriage: హీరో ప్రభాస్ పెళ్లిపై స్పష్టమైన ప్రకటన చేసిన శ్యామలాదేవి.. అసలేమన్నారు? (వీడియోతో)

ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది.

Young Rebel star Prabhas Donates Rs.5 Crore to Telugu states

Hyderabad, Oct 8: టాలీవుడ్ (Tollywood) లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మారిన హీరో ప్రభాస్ (Hero Prabhas) పెళ్లి ఎప్పుడంటూ చర్చ జరుగడం ఇప్పటిది కాదు. ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ పెళ్లి రోజు త్వరలోనే రానుందని ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పారు. నవరాత్రుల నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్యామల మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అందరూ ఎదురుచూస్తున్న ఆ రోజు త్వరలోనే రానుందని పేర్కొన్నారు.

అజ‌య్ దేవ్‌గ‌ణ్ సింగం అగైన్ ట్రైలర్ ఇదిగో, దీపావళి కానుకగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు మూవీ

Here's Video:

కృష్ణంరాజు దీవెనలు కూడా

ఇంకా ఆమె మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతోపాటు పై నుంచి కృష్ణంరాజు దీవెనలు కూడా ప్రభాస్‌ పై ఎప్పటికీ ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. తమ అభిమాన హీరో పెళ్లి త్వరలో జరుగబోతుందని తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

జీవా, రాశీఖన్నా లేటెస్ట్ మూవీ Aghathiyaa నుంచి ఫస్ట్ లుక్ విడుదల, యాక్షన్‌ కింగ్ అర్జున్‌ కీలక పాత్రలో, హార్రర్ థ్రిల్లర్‌ జోనర్‌లో రానున్న సినిమా



సంబంధిత వార్తలు