Representational Image (Photo Credits: File Photo)

Chennai, Mar 7: తమిళనాడు (Tamil Nadu) కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామంలో ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 29 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి పెద్దలు బాల్య వివాహం (Child Marriage) చేశారు. అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి గుండెలు అవిసేలా ఏడ్చింది. వెళ్లనని మారాం చేసింది. బాలికకు నచ్చచెప్పడానికి ఇరు వైపుల బంధువులు ఎంతో చూశారు. అయితే, అభంశుభం తెలియని ఆ చిన్నారి తల్లిదండ్రులను విడిచి వెళ్ళడానికి ససేమీరా అంది.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!

బాలికను భుజాలపై ఎత్తుకొని..

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పెళ్లికొడుకు.. బాలిక ఏడుస్తున్నా, భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం తెలుసుకొన్న పోలీసులు భర్తను, భర్త తమ్ముడిని, బాలిక తల్లిని ఇలా మొత్తంగా ఐదుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

ఎలాన్‌ మస్క్‌కు మరో షాక్.. పేలిన స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్, జనాలున్న స్థలాల్లోనే పడిన శకలాలు, వీడియో ఇదిగో