Kalki 2898 AD Release Date: ప్ర‌భాస్ క‌ల్కి మూవీ కొత్త రిలీజ్ డేట్ క‌న్ఫార్మ్ అయింది! మే 9 నుంచి ఆ రోజుకు దాదాపు ఖ‌రారు చేసిన నిర్మాత‌లు

కల్కి రిలీజ్ డేట్ ని మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నికల హడావుడి వల్ల సినిమా ఓపెనింగ్స్ పై భారీ ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా ప్లాప్ అయ్యే అవకాశం ఉంది. అందువలనే మూవీని పోస్టుపోన్ చేస్తున్నారు.

Kalki 2898 AD (photo-Twitter)

Hyderabad, April 06: సి అశ్వినీదత్ నిర్మాణంలో ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 Ad). వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్, దిశాపటాని హీరోయిన్స్‌, అమితాబ్ బచ్చన్ (Amithab), రాజేంద్రప్రసాద్, పశుపతి, కమల్ హాసన్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. అలాగే మరికొంతమంది స్టార్స్ కూడా గెస్ట్ అపిరెన్స్ ఇవ్వనున్నారట. కాగా ఈ మూవీని మే 9న రిలీజ్ (Kalki 2898 Ad release date) చేస్తామంటూ నిర్మాతలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ డేట్ కి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు అడ్డుగా వచ్చాయి. దీంతో కల్కి రిలీజ్ డేట్ ని మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నికల హడావుడి వల్ల సినిమా ఓపెనింగ్స్ పై భారీ ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా ప్లాప్ అయ్యే అవకాశం ఉంది. అందువలనే మూవీని పోస్టుపోన్ చేస్తున్నారు.

Shah Rukh In Visakhapatnam: వీడియో ఇదిగో, విశాఖలో అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, రేపు సాయంత్రం వరకు అక్కడే.. 

ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. దీంతో ఈసారి వాయిదా వేసినా మరి లేట్ చేయకుండా దగ్గర డేట్ తోనే వచ్చేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారట. ఈ చిత్రాన్ని మే 30న వేసవి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారట. ఆ సమయానికి ఎన్నికల పోలింగ్ అయిపోతుంది. కౌంటింగ్ అండ్ రిజల్ట్ డేతో సినిమాకి వచ్చిన పెద్ద నష్టం ఏమి ఉండదు. అందుకనే సినిమాని మే 30న రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట.

Allu Arjun Wax Statue in Dubai: దుబాయ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం, ఆ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ 

ఉగాది పండుగా నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తారట. ముందుగా ఓ యానిమేటెడ్ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఆ టీజర్ తోనే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారట. ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రం డబ్బింగ్ వర్క్స్ జరుపుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement