representational picture of Hindu wedding. (Photo credits: Pixabay)

Jaipur, March 01: బాల్య వివాహాలను నివారించడానికి రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి అని పేర్కొంది. (Date Of Birth On Wedding Cards) బాల్య వివాహాలపై నిఘా పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాజస్థాన్‌లో చాలా ఏళ్లుగా అక్షయ తృతీయ (అఖా తీజ్), పీపాల్ పూర్ణిమ పండుగల సందర్భాల్లో బాల్య వివాహాలు జరుగుతాయి.  కాగా, ఈ పండుగల దృష్ట్యా రాజస్థాన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాల్య వివాహాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టింది. వధూవరుల వయస్సు రుజువును వారి కుటుంబాల నుంచి పొందాలని, పెళ్లి ఆహ్వాన కార్డుపై ఇద్దరి పుట్టిన తేదీలు ముద్రించాలని ప్రింటింగ్ ప్రెస్‌లను ఆదేశించింది. అలాగే పెళ్లి తంతులో కీలకమైన పురోహితులు, టెంట్ హౌస్‌లు, బ్యాండ్ మేళాలు, క్యాటర్లు, రవాణాదారులు వంటి అన్ని వర్గాలను అధికారులను సంప్రదించాలని పేర్కొంది.

Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్.. బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, వాతావరణం కాలుష్యం నేపథ్యంలో కీలక నిర్ణయం 

మరోవైపు బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలని, బాల్య వివాహ నిషేధ చట్టంపై అన్ని వర్గాలను చైతన్యం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు, పోలీస్‌ అధికారులు ఈ సీజన్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. బాల్య వివాహాలను నివారించడానికి ప్రభుత్వ యంత్రాంగాలను చురుకుగా ఉంచాలని సూచించింది. రాజస్థాన్‌ హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్ ఈ మేరకు వివరణాత్మక ఆదేశాలు జారీ చేశారు.