Upendra: అవమానకర సామెత వాడి చిక్కుల్లో పడ్డ నటుడు ఉపేంద్ర.. ఇప్పటివరకూ రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు.. పొరపాటున తన నోటి నుంచి ఈ కామెంట్ దొర్లిందని నటుడి వివరణ

కన్నడ నటుడు ఉపేంద్ర వివాదంలో చిక్కుకున్నారు. దళితులపై అభ్యంతరకర వ్యాఖ్య చేసిన ఆయన చివరకు క్షమాపణలు చెప్పారు. అయితే, ఓ వర్గాన్ని అవమానించారంటూ ఉపేంద్రపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఉపేంద్ర తన రాజకీయ పార్టీ ప్రజాకీయను విమర్శిస్తున్న వారిపై ఫేస్‌ బుక్‌ సెషన్‌ లో మండిపడ్డారు. ఈ సందర్భంగా అవమానకర రీతిలో దళితుల ప్రస్తావన తెచ్చారు.

Upendra (Credits: X)

Newdelhi, Aug 14: కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) వివాదంలో చిక్కుకున్నారు. దళితులపై (Dalits) అభ్యంతరకర వ్యాఖ్య చేసిన ఆయన చివరకు క్షమాపణలు చెప్పారు. అయితే, ఓ వర్గాన్ని అవమానించారంటూ ఉపేంద్రపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ (FIR) లు నమోదు చేశారు. ఉపేంద్ర తన రాజకీయ పార్టీ ప్రజాకీయను (Prajakeeya) విమర్శిస్తున్న వారిపై ఫేస్‌ బుక్‌ సెషన్‌ లో మండిపడ్డారు. ఈ సందర్భంగా అవమానకర రీతిలో దళితుల ప్రస్తావన తెచ్చారు. ‘‘నిష్కల్మషమైన హృదయాలతోనే మార్పు సాధ్యం. కానీ కొందరు మాత్రం చాలా ఖాళీగా ఉంటారు. మనసుకు తోచింది వాగేస్తుంటారు. ఓ టౌన్ ఉందంటే అక్కడ తప్పనిసరిగా దళితులు ఉన్నట్టు వీళ్లు కూడా ఉంటుంటారు’’ అని తన పార్టీ అభిమానులు, మద్దతుదారులతో ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టా లైవ్ సెషన్ లో ఉపేంద్ర కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యల తాలూకు వీడియో వైరల్ కావడంతో ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Annavaram: అన్నవరంలో రేపటి నుండి కొత్త నిబంధన.. రేపటి నుంచి కొండపై దుకాణాల్లో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో ప్రకటన.. గాజు, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో నీరు విక్రయించేందుకు మాత్రమే అనుమతి

Leopard at Tirumala: తిరుమలలో ఆరేళ్ల బాలికను పొట్టనపెట్టుకున్న చిరుత ఆటకట్టు.. ఎట్టకేలకు బోనులోకి.. వీడియోతో..

క్షమాపణలు

తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఉపేంద్ర సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘‘లైవ్ సెషన్‌లో నేను ఈ రోజు పొరపాటున ఓ అభ్యంతరకర వ్యాఖ్య చేశాను. ఇది అనేక మంది మనసులను గాయపరిచిందని తెలియగానే వీడియోను డిలీట్ చేశాను. ఇలాంటి వ్యాఖ్య చేసినందుకు క్షమాపణ చెబుతున్నా’’ అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement