Representational Image (Photo Credits: File Photo)

Lucknow, Feb 03: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో దళిత మహిళపై హత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు, కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. అయోధ్యలో దళిత బాలికను దారుణంగా హత్య చేయడాన్ని ఖండించారు. ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం "బహుజన వ్యతిరేక" అని ఆరోపిస్తూ, అక్కడ "హీనమైన దౌర్జన్యాలు" కొనసాగుతున్నాయని అన్నారు.

సహాయం కోసం బాధిత బాలిక కుటుంబీకులు చేస్తున్న మొరను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన రాహుల్, ఇంకా ఎన్ని కుటుంబాలు ఇలా కష్టాలు పడాల్సి వస్తుందని ప్రశ్నించారు.అయోధ్యలో దళిత పుత్రికను అమానుషంగా, దారుణంగా హత్య చేయడం (Dalit Girl Rape-Murder in Ayodhya) హృదయ విదారకమైనది, చాలా సిగ్గుచేటు.. తొలి రోజే బాలిక కుటుంబం సహాయం కోసం చేసిన ఆర్తనాదాలకు ప్రభుత్వం తలొగ్గి ఉంటే.. బహుశా ఆమె మన మధ్య ఉండేది." “ఈ దారుణమైన నిర్లక్ష్యం వల్ల మరో కూతురి జీవితం ముగిసిపోయిందని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

కూతుళ్లను రక్షించలేని ఈ పదవి నాకెందుకు, అయోధ్యలో దళిత మహిళపై హత్యాచారం ఘటనపై భోరున విలపించిన ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్

ఇంకెన్ని కుటుంబాలు మీ పాలనలో ఇలా ఏడ్చి, బాధ పడాల్సి వస్తుందో.. బహుజన వ్యతిరేక బీజేపీ పాలనలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో దళితులపై దారుణమైన దౌర్జన్యాలు, అన్యాయాలు, హత్యలు జరుగుతున్నాయి. ఇది విపరీతంగా పెరుగుతోందని మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని గౌరవంగా చూడాలని, వారిని వేధింపులకు గురిచేయవద్దని గాంధీ అధికారులకు విజ్ఞప్తి చేశారు,

గతంలో కూడా ఇలాంటి కేసుల్లోనే జరిగాయని పేర్కొన్నారు. " ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నేరంపై తక్షణమే విచారణ జరిపి, దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దయచేసి బాధిత కుటుంబాన్ని యథావిధిగా వేధించకండి. దేశంలోని ఆడబిడ్డలు, మొత్తం దళిత సమాజం న్యాయం కోసం మీ వైపు చూస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలో దళిత బాలిక మృతదేహం కనిపించడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ ఆదివారం విలేకరుల సమావేశంలో విలపించారు .

విలేఖరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు, ఇది "అత్యంత విచారకరమైన, అమానవీయమైన" నేరమని పేర్కొన్నారు. ఇంకా న్యాయం జరగకపోతే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు. అంతకుముందు, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా బిజెపి నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని నిందించార. "బిజెపి యొక్క జంగిల్ రాజ్" లో "దళితుల, గిరిజనులు, వెనుకబడిన, పేదల" ఆర్తనాదాలను ఎవరూ వినడం లేదని పేర్కొన్నారు.

"అయోధ్యలో భగవత్ కథ వినడానికి వెళ్లిన దళిత బాలికపై జరిగిన అనాగరికత ఏ మనిషికైనా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇలాంటి క్రూరమైన సంఘటనలు యావత్ మానవాళికి సిగ్గుచేటు" అని ప్రియాంక గాంధీ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.ఆ బాలిక కనిపించకుండా పోయి మూడు రోజులు అవుతున్నా పోలీసులు చేసిందేమీ లేదు. బీజేపీ జంగిల్ రాజ్‌లో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారి రోదనలు వినడానికి ఎవరూ లేరు. దళితులపై జరిగిన అఘాయిత్యాలకు యూపీ ప్రభుత్వం పర్యాయపదంగా మారిందన్నారు.

మరోవైపు యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు ప్రియాంక మౌర్య బాధిత కుటుంబాలను పరామర్శించి, ఘటనలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.బాధితురాలి కుటుంబాన్ని కలిసిన అనంతరం మౌర్య ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకరమైన సంఘటన.. బాధిత కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇక్కడికి వచ్చానని.. వారి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చానని.. ఈ ఘటనకు పాల్పడిన వారెవరైనా సరే విడిచిపెట్టేది లేదు. రాష్ట్రంలో యోగి ప్రభుత్వం ఉంది, కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు.