Lucknow, Feb 03: అయోధ్యలో దళిత యువతి దారుణ హత్యకు గురయ్యారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన దుండగులు, అనంతరం కిరాతకంగా హత్య చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఆమె గురువారం రాత్రి భాగవత కథ వినడానికి వెళ్లారు. ఆ మర్నాడు కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. వివస్త్రగా ఉన్న ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయి. ఎముకలు విరిగిపోయాయి. ఆమె శరీరాన్ని తాళ్లతో కట్టేశారు. కళ్లు పీకేశారు. ఆమె కనిపించకుండాపోయినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశామని సర్కిల్ ఆఫీసర్ అశుతోష్ తివారీ చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
శనివారం ఆమె మృతదేహాన్ని అత్యంత దారుణ స్థితిలో గ్రామ సమీపంలోని కాల్వలో గుర్తించారు. కాళ్లూచేతులు విరగ్గొట్టి, కళ్లు పీకేయడమే కాక మర్మావయాల్లో కర్ర దూర్చినట్లు తేలింది. శరీరంపై ఇతర చోట్లా తీవ్ర గాయాలున్నాయని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. శరీరంపై ఇతర చోట్లా తీవ్ర గాయాలున్నాయని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. యువతి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించలేదని విమర్శించారు. ఈ దారుణంపై యోగీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి ప్రతిపక్ష పార్టీలు. యోగీ రాజ్యంలో దళిత మహిళలకు రక్షణ లేదు అని మండిపడ్డాయి. తాజాగా ఈ ఘటనలో పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.