Recruitment Scam: బాస్ కోరికను తీర్చితేనే ఉద్యోగం.. ఉద్యోగ అవకాశాల పేరుతో మహిళా అభ్యర్థులకు లైంగిక వేధింపులు.. అందరూ జాగ్రత్తగా ఉండాలంటున్న సింగర్ చిన్మయి శ్రీపాద..
ఉద్యోగ అవకాశాల పేరుతో మహిళా అభ్యర్థులకు అనుచిత డిమాండ్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్న రిక్రూటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద హెచ్చరించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళలు ఇలాంటి మోసగాళ్ల వలలో పడకూడదని సూచించారు.
Recruitment Scam: ఉద్యోగ అవకాశాల పేరుతో మహిళా అభ్యర్థులకు అనుచిత డిమాండ్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్న రిక్రూటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద హెచ్చరించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళలు ఇలాంటి మోసగాళ్ల వలలో పడకూడదని సూచించారు. ఇటీవల ఒక ఉద్యోగార్థికి.. రిక్రూటర్ వేషంలో ఉన్న వ్యక్తికి మధ్య వాట్సాప్‌లో జరిగిన అభ్యంతరకర సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
చిన్మయి పంచుకున్న వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో సీనియర్ టెక్నికల్ రిక్రూటర్ పోస్టు కోసం ఒక మహిళా అభ్యర్థి తన రెజ్యూమెను పంపగా.. సదరు రిక్రూటర్ అదనపు ఫోటోలను డిమాండ్ చేశాడు. అనంతరం నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల జీతం ఇప్పిస్తానని చెబుతూ.. ఉద్యోగం పొందాలంటే ఫ్రెషర్లు 'బాస్‌ను వ్యక్తిగతంగా కలిసి.. వారి కోరికలకు అనుగుణంగా సంబంధం (Relationship) ఏర్పరచుకోవాలని షరతు విధించాడు. ప్రసుతం మార్కెట్ పరిస్థితులు ఇలాగే ఉన్నాయని.. దానికి సిద్ధపడితేనే ఆఫర్ ఇప్పిస్తానంటూ అసభ్యకర సందేశాలు పంపాడు.
ఈ తరహా వేధింపులకు పాల్పడే వారిని రిక్రూటర్ల ముసుగులో ఉన్న 'సెక్స్ ట్రాఫికర్లు, విటులు'గా చిన్మయి అభివర్ణించారు.
Chinmayi Sripaada Shares Recruiter Chat
ఉద్యోగార్థులు ఇలాంటి అసభ్యకర సందేశాలను ఇన్బాక్స్ నుంచి తొలగించకుండా, పూర్తి ఆధారాలతో స్క్రీన్‌షాట్‌లు తీసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. అధికారులు చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా, అధికారిక రికార్డుల్లో ఫిర్యాదుల కాపీలను భద్రపరచుకోవడం ముఖ్యం అని ఆమె సలహా ఇచ్చారు. బాధితురాలు ఆ వ్యక్తిని బ్లాక్ చేసినట్లు తెలిసినప్పటికీ.. సదరు రిక్రూటర్ గుర్తింపుపై ఇంకా స్వతంత్ర ధ్రువీకరణ రావాల్సి ఉంది.