Swatantrya Veer Savarkar Teaser: వీర్ సావర్కర్ టీజర్‌లో అదరగొట్టిన రణ్‌దీప్ హుడా, అచ్చం సావర్కర్‌ను దించేసిన బాలీవుడ్ హీరో
వీర్ సావర్కర్ (Swatantrya Veer Savarkar) జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఆయన 140వ జయంతి పురస్కరించుకొని ‘స్వతంత్య్ర్ వీర్ సావర్కర్’ టీజర్ ను విడుదల చేశారు. గతేడాది ఆయన జయంతి సందర్భంగా మూవీని ప్రారంభించారు. ఈ సినిమాను వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ తన జీవితాన్ని ఎక్కువగా గడిపిన ప్రదేశాల్లోనే చిత్రీకరిచారు.
Mumbai, May 28: గత కొన్నేళ్లుగా సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు, హీరోలు, స్పోర్ట్స్ పర్సన్స్, మాపియా డాన్స్ ఇలా ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ఆకట్టుకునే అంశం ఉంటే.. ఆయా దర్శక, నిర్మాతలు, హీరోలు అటువంటి సబ్జెక్ట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో గత కొన్నేళ్లుగా ఇలాంటి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా స్వాతంత్య్ర పోరాటంలో తన ముప్పావు జీవితాన్ని జైల్లో గడిపిన స్వాతంత్య్ర వీరుడు సాహసి అయిన వీర్ సావర్కర్ (Swatantrya Veer Savarkar) జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఆయన 140వ జయంతి పురస్కరించుకొని ‘స్వతంత్య్ర్ వీర్ సావర్కర్’ టీజర్ ను విడుదల చేశారు.
గతేడాది ఆయన జయంతి సందర్భంగా మూవీని ప్రారంభించారు. ఈ సినిమాను వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ తన జీవితాన్ని ఎక్కువగా గడిపిన ప్రదేశాల్లోనే చిత్రీకరిచారు. వీర్ సావర్కర్ పాత్రలో రణ్‌దీప్ హుడా (Randeep Hooda) ముఖ్యపాత్రలో నటించారు. ఈ మూవీకి డైరక్టర్ కూడా ఆయనే వహిస్తున్నారు. టీజర్‌లో ఆయన పర్మామెన్స్ చాలా బాగుందని కితాబు వస్తుంది. ఇక లుక్ విషయంలో రణ్ దీప్ హుడాపై ప్రశంసలు కురుస్తున్నాయి.