Actress Deepa Suicide: తమిళ హీరోయిన్ ఆత్మహత్య, జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటా! అంటూ సూసైడ్ నోట్, తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నటి ప్రేమ వ్యవహారం, కొన్నాళ్లుగా ఒంటరిగా ఫ్లాట్‌లో ఉంటున్న హీరోయిన్
దీంతో ఆమె స్నేహితుడు ఫ్లాట్‌కి వెళ్లి చూడగా.. దీప ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే దీప స్నేహితుడు పోలీసులతో పాటు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Chennai, SEP 18: తమిళ యువ నటి దీప ఆత్మహత్య (Deepa suicide) విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆత్మహత్యకు (suicide) ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఓ యువకుడితో దీప ప్రేమలో ఉన్నట్లు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి ఆమె డిప్రెషన్‌లో ఉందని.. తమ ఫోన్ కాల్స్ కూడా ఎత్తడం లేదని దీప తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిన్న కూడా దీపకు చాలాసార్లు ఫోన్ చేశామని ఆమె లిఫ్ట్ చేయలేదని చెప్పారు. దీంతో దీప స్నేహితుడిని ఆమె ఫ్లాట్‌కు వెళ్లి చూడమని చెప్పామని వాపోయారు. అటు దీప మృతిపట్ల కోలీవుడ్ (kollywood) ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న దీప ఆత్మహత్య (suicide) చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రీల్స్ చేస్తూ ఉత్సాహంగా ఉండే దీప ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నామని ఆమె స్నేహితులు రోదిస్తున్నారు.
చెన్నైలోని విరుగంబాక్కంలోని తన ఫ్లాట్‌లో దీప ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. గత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న దీప మానసిక ఒత్తిడికి (depression) గురై ఆత్మహత్యకు పాల్పడిందని స్నేహితులు చెప్తున్నారు. దీపతో మాట్లాడడానికి ఆమె కుటుంబసభ్యులు పోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులకు దీప స్నేహితుడికి సమాచారం అందించారు. దీంతో ఆమె స్నేహితుడు ఫ్లాట్‌కి వెళ్లి చూడగా.. దీప ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే దీప స్నేహితుడు పోలీసులతో పాటు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ లభించినట్లు తెలుస్తోంది. అందులో తన చావుకు ఎవరు కారణం కాదని చెబుతూనే జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటా అని రాసినట్లు సమాచారం. అయితే పలు తమిళ సినిమాల్లో సహాయ నటిగా అలరించింది దీప. చిన్న పాత్రలు పోషించినా.. తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.