HC Notices to Raghavendra Rao: ప్రభుత్వ భూముల్లో కమర్షియల్ కాంప్లెక్స్, టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ షేక్‌పేట పరిధిలో రెండు ఎకరాలు (ఆర్‌కే సినీప్లెక్స్ ఉన్న స్థలం) కేటాయింపును సవాల్ చేస్తూ 2012లో దాఖలైన పిల్‌లో ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు , ఆయన సోదరుడు కె. కృష్ణమోహన్‌రావు, ఆయన కుటుంబసభ్యులకు తెలంగాణ హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది

Raghavendra Rao

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ షేక్‌పేట పరిధిలో రెండు ఎకరాలు (ఆర్‌కే సినీప్లెక్స్ ఉన్న స్థలం) కేటాయింపును సవాల్ చేస్తూ 2012లో దాఖలైన పిల్‌లో ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు , ఆయన సోదరుడు కె. కృష్ణమోహన్‌రావు, ఆయన కుటుంబసభ్యులకు తెలంగాణ హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్‌లోని సర్వే నంబర్‌ 403/1లో రికార్డింగ్‌, రీ-రికార్డింగ్‌ థియేటర్‌ నిర్మించేందుకు ఎకరానికి రూ.8,500 చొప్పున భూమి ఇచ్చారు.

టీడీపీ ప్రభుత్వం 2003లో మినీ థియేటర్, ఫిల్మ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.అయితే ఆ కుటుంబం కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించింది. దీన్ని సవాల్ చేస్తూ 2012లో హైకోర్టులో పిల్ దాఖలైంది.గతేడాది కోర్టు నోటీసులు జారీ చేసినా అక్నాలెడ్జిమెంట్ రాలేదు. దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి నోటీసులు జారీ చేసి జనవరి మూడో వారానికి విచారణ వాయిదా వేసింది.

మోకాలీ సర్జరీ తర్వాత ఇటలీ నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ప్రభాస్.. ఫోటోస్ వైరల్

రాఘవేంద్రరావుకు ప్రభుత్వం కేటాయించిన బంజారాహిల్స్‌లోని రెండెకరాల భూమిని రద్దు చేయాలని మెదక్‌కు చెందిన బాలకిషన్‌ గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ మేరకు తాజాగా రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రాయితీ ధరతో ప్రభుత్వం భూమి కేటాయిస్తే.. వారు దాన్ని షరతులకు విరుద్ధంగా వాడుతున్నారని ఆయన పిల్ దాఖలు చేశాడు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్‌ రెడ్డి కూడా ముందస్తు బెయిల్

Pune Court: నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? మహిళకు జడ్జి ప్రశ్న.. అసలేం జరిగింది??

Advertisement
Advertisement
Share Now
Advertisement