Jagarlamudi Radha Krishna Murthy Passed Away: టాలీవుడ్ విషాదం.. నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సినీ నిర్మాత, నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) కన్నుమూశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు.

Jagarlamudi Radha Krishna Murthy Passed Away (Credits: X)

Hyderabad, Oct 28: టాలీవుడ్ (Tollywood) లో విషాదం చోటుచేసుకుంది. సినీ నిర్మాత, నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) (Jagarlamudi Radha Krishna Murthy Passed Away) కన్నుమూశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు. తొలుత సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారారు. వియ్యాలవారి కయ్యాలు, ప్రతిబింబాలు, ఒక దీపం వెలిగింది, శ్రీవినాయక విజయం, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త వంటి సినిమాలు నిర్మించారు. అక్కినేని నాగేశ్వర్ రావుతో 1982లో ఆయన తీసిన 'ప్రతిబింబాలు' 2022లో విడుదలైంది.

ప్రాణాలను గుప్పిటపెట్టుకొని.. తోసుకొంటూ బయటకు పరిగెత్తుతూ.. అబిడ్స్ లో బాణసంచా షాపులో అగ్నిప్రమాదం ముందు ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. (వీడియోతో)

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంతాపం

జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి మృతిపట్ల తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంతాపం తెలిపింది. ‘తెలుగు చలనచిత్ర నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి గారు రాత్రి బాపట్ల దగ్గర కారంచేడులో స్వర్గీయులు కావడం జరిగింది. ఈ వార్త అందరిని ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము’ అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఒక ప్రకటనలో తెలిపింది.

తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు.. ఇస్కాన్ ఆలయానికి తాజాగా బెదిరింపులు.. నగరవాసులు, భక్తులు ఆందోళన

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement