Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ దర్శకుడు వాసువర్మ అరెస్ట్.. సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ, ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ ఇచ్చిన సమాచారంతో వాసువర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు

టాలీవుడ్‌ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ వివాదంలో సినీ ఫైనాన్షియర్లు సహా మరికొందరిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్‌న్యాబ్) అరెస్ట్ చేసింది.

Credits: Twitter (Representational Image)

Hyderabad, Sep 25: టాలీవుడ్‌ లో (Tollywood) సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు (Drugs Case) రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ వివాదంలో సినీ ఫైనాన్షియర్లు సహా మరికొందరిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్‌న్యాబ్) అరెస్ట్ చేసింది. ఈ కేసులో సినీనటుడు నవదీప్‌ (Navdeep) ను కూడా అధికారులు విచారించారు. ఇదే కేసులో దర్శకుడు మంతెన వాసువర్మను (Director Vasu Varma) ఈ నెల 5న మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

TTD Special Darshan Tickets: నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. ఏ నెల కోటా అంటే??

అలా బయటకు

సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ అలియాస్ దివాకర్, పూణెకు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ తెలోర్ ఇదే కేసులో జూన్‌ లో అరెస్ట్ అయ్యారు. వీరిద్దరిని జూన్ 19న అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 70 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో వీరి ద్వారా  వాసువర్మ పేరు కూడా వెలుగులోకి రావడంతో ఈ నెల 5న ఆయనను అరెస్ట్ చేశారు. వీరికి డ్రగ్స్ సరఫరా చేసే ముంబైకి చెందిన విక్టర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

India Won Series: దుమ్మురేపిన టీమిండియా, మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో సిరీస్ కైవసం, రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో ఘన విజయం

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement