Tollywood: సమస్యలు పరిష్కారమయ్యాకే షూటింగ్స్, ఆగస్టు 1 నుంచి మూవీ షూటింగ్స్ బంద్ చేస్తున్నామని తెలిపిన తెలుగు ఫిలిం చాంబ‌ర్

ఆగ‌స్టు 1 నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. 24 క్రాఫ్ట్స్‌లో అంద‌రికీ ఇబ్బందులున్నాయ‌ని..వాటిని ప‌రిష్క‌రించే వ‌ర‌కు షూటింగ్స్ నిలిపేస్తున్నామ‌ని తెలుగు ఫిలిం చాంబ‌ర్ (Telugu Film Chamber) అధ్య‌క్షుడు బ‌సిరెడ్డి ప్ర‌క‌టించారు. ఈ విష‌య‌మై చ‌ర్చించేందుకు నేడు ఫిలిం చాంబ‌ర్ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ స‌మావేశ‌మైంది.

Tollywood Logo

ఆగ‌స్టు 1 నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. 24 క్రాఫ్ట్స్‌లో అంద‌రికీ ఇబ్బందులున్నాయ‌ని..వాటిని ప‌రిష్క‌రించే వ‌ర‌కు షూటింగ్స్ నిలిపేస్తున్నామ‌ని తెలుగు ఫిలిం చాంబ‌ర్ (Telugu Film Chamber) అధ్య‌క్షుడు బ‌సిరెడ్డి ప్ర‌క‌టించారు. ఈ విష‌య‌మై చ‌ర్చించేందుకు నేడు ఫిలిం చాంబ‌ర్ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశంలో ప్రొడ్యూస‌ర్‌గిల్డ్ నిర్ణ‌యానికి ఫిలించాంబ‌ర్ మ‌ద్ద‌తు తెలిపింది. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోన్న సినిమాల చిత్రీకరణలు కూడా నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్‌ నిర్ణయం తీసుకుంది.

చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ఆగస్ట్‌ 1న షూటింగ్స్‌ బంద్‌ ( movie shootings Bandh from August 1) చేయాలని టాలీవుడ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చించేందుకే ఆదివారం ఫిలిం చాంబర్‌ జనరల్‌ బాడీ సమావేశమైంది.

ముంబై లోకల్ ట్రైన్లో అనన్య ఒడిలో పడుకున్న విజయ్, లైగర్ ప్రమోషన్స్ ‘ట్రాక్’లో ఉన్నాయి. లెట్స్ గో బాయ్స్ అంటూ హీరోయిన్ ట్వీట్

ఈ సమావేశంలో గిల్డ్‌ తీసుకున్న నిర్ణయానికి ఫిలిం చాంబర్‌ మద్దతు ఇచ్చింది. 24 క్రాఫ్ట్స్ లో అందరికీ ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పరిష్కరించేవరకు షూటింగ్స్‌ నిలివేస్తున్నామని తెలుగు ఫిలిం ఛాంబర్ ( telugu film chamber of commerce) ప్రకటించింది. రన్నింగ్‌లో ఉన్న సినిమాల షూటింగ్స్‌ కూడా నిలివివేస్తున్నామని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. సమస్యల పరిష్కారం దొరికేంత వరకు ఈ నిర్ణయం ఉంటుందని చెప్పారు.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న గాడ్ ఫాద‌ర్‌, చిరు 154, బాల‌కృష్ణ‌-గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఎన్‌బీకే 107, క్రిష్‌-ప‌వ‌న్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు, రాంచ‌ర‌ణ్‌-శంక‌ర్ ఆర్‌సీ 15, వంశీపైడిప‌ల్లి-విజ‌య్, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌-శివ‌నిర్వాణ ఖుషి, స‌మంత న‌టిస్తోన్న య‌శోద‌, అఖిల్ చేస్తోన్న ఏజెంట్ సినిమా ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్నాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement