టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే నటిస్తున్న సంగతి విదితమే. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ అవుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు. చిత్రం బృందం ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో విజయ్, అనన్య పాల్గొన్నారు. వివిధ అంశాలపై ఈ ఇద్దరూ బోల్డ్ గా సమాధానాలు ఇచ్చారు.

తాజాగా ప్రమోషన్లో భాగంగా ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు ఈ ఇద్దరూ ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయణించారు. ముంబైలో ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకునేందుకు వీరు ట్రైన్ ఎంచుకున్నారు. ట్రైన్ వచ్చే వరకూ రైల్వే స్టేషన్‌లో చాలా సేపు వేచి ఉన్నారు. ట్రైన్లో ఎక్కిన తర్వాత ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆలసిపోయాడో ఏమో గానీ విజయ్ కొద్దిసేపు అనన్య ఒడిలో పడుకొని కునుకు తీశాడు. ఈ ఫొటోలను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘లైగర్ ప్రమోషన్స్ ‘ట్రాక్’లో ఉన్నాయి. లెట్స్ గో బాయ్స్’ అని పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)