Upasana Konidela Birthday: దయా హృదయంతో నీవు చేసే పనులు ఎప్పటికీ వృధాకావు, శ్రీమతికి చెర్రీ పుట్టినరోజు శుభాకాంక్షలు, పూల హరివిల్లు మధ్యన ఉపాసన
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన ఈ రోజు 31వ వసంతంలోకి (Upasana Konidela Birthday) అడుగుపెట్టింది. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆమె భర్త రామ్ చరణ్ .. తన శ్రీమతికి సంబంధించిన ఫోటో ఒకటి షేర్ చేస్తూ.. దయా హృదయంతో నువ్వు చేసే పనులు చిన్నవైన ఎప్పటికీ వృధాకావు. రివార్డులు వచ్చిన కూడా నీ పనులని ఇలానే కొనసాగిస్తావని ఆశిస్తున్నాను.. హ్యాపీ బర్త్‌డే అంటూ చరణ్ తన పోస్ట్‌లో తెలిపారు. ఫోటోలో పూల హరివిల్లు మధ్య కూర్చున్న ఉపాసన (Upasana Kamineni Konidela) దూరంగా దేన్నో నిశితంగా చూస్తున్నట్లు కనిపిస్తోంది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన ఈ రోజు 31వ వసంతంలోకి (Upasana Konidela Birthday) అడుగుపెట్టింది. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆమె భర్త రామ్ చరణ్ .. తన శ్రీమతికి సంబంధించిన ఫోటో ఒకటి షేర్ చేస్తూ.. దయా హృదయంతో నువ్వు చేసే పనులు చిన్నవైన ఎప్పటికీ వృధాకావు. రివార్డులు వచ్చిన కూడా నీ పనులని ఇలానే కొనసాగిస్తావని ఆశిస్తున్నాను.. హ్యాపీ బర్త్‌డే అంటూ చరణ్ తన పోస్ట్‌లో తెలిపారు. ఫోటోలో పూల హరివిల్లు మధ్య కూర్చున్న ఉపాసన (Upasana Kamineni Konidela) దూరంగా దేన్నో నిశితంగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఆసక్తికరం, చెర్రీతో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు కీర్తి సురేష్ లేదా కియారా అద్వానీ ఫిక్స్, మరిన్ని విశేషాలు చదవండి
ఉపాసన లో సామాజిక దృక్పథం చాలా ఉంది. ఆమె అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమాని పొందుతుంది. 2012 జూన్ 14న రామ్‌చరణ్ ఉపాసనను వివాహం చేసుకున్నారు. ఇటీవలే వీరి వివాహ బంధానికి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాసన సోషల్ సర్వీస్‌కి సంబంధించిన ఫోటోలు, తమ ఆసుపత్రి సిబ్బందితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఫోటోలు, చెర్రీకి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్‌ని అలరిస్తూ ఉంటుంది.
Here's Tweet
భళ్లాల దేవ రానా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చెర్రీ, ఉపాసనతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ బర్త్‌డే విషెస్ తెలిపారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పలువురు సెలబ్రిటీలు మెగా కోడలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.. అబిమానులు సైతం హ్యాపీ బర్త్‌డే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 2012 జూన్ 14న రామ్‌చరణ్ ఉపాసనను వివాహం చేసుకున్నారు. ఈ మధ్యే వీరి పెళ్లి బంధానికి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి