Chiranjeevi's 'Acharya': మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఆసక్తికరం, చెర్రీతో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు కీర్తి సురేష్ లేదా కియారా అద్వానీ ఫిక్స్, మరిన్ని విశేషాలు చదవండి
Kiara Advani or Keerthy Suresh for Ram Charan's Acharya (Photo Credits: Instagram)

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన కొత్త చిత్రం 'ఆచార్య' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. సామాజిక నేపథ్యం ఉన్న కథనంతో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అంతకుముందు ఈ పాత్రకు త్రిషను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే తన పాత్రలో కొన్నింటిని విభేదిస్తూ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో త్రిష స్థానంను కాజల్‌తో భర్తీ చేశారు.

ఆచార్య సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానెర్‌లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. విశేషమేమంటే చరణ్ కూడా ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేస్తున్నారు. మెగా తండ్రీకొడుకులు చిరు-చెర్రీ మరోసారి తెరపై కనిపిస్తూ మెగా అభిమానులకు కనివిందు చేయనున్నారు.

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఎవరు నటిస్తారు అని ఇంతకాలం ఉన్న సస్పెన్స్‌కు తెరపడినట్లే కనిపిస్తుంది. చరణ్‌తో ఆన్ స్క్రీన్‌పై రొమాన్స్ చేయటానికి సినిమా యూనిట్ ఇద్దరు హీరోయిన్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.  'మహానటి' కీర్తి సురేశ్ లేదా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఫిక్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ నక్సలైట్ పాత్ర పోషిస్తున్నట్లు వినికిడి. మరోవైపు రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల కాంబినేషన్లో ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న RRR సినిమాపై కూడా అభిమానుల్లో ఆత్రుత నెలకొని ఉంది.

ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ సినిమా యొక్క తెలుగు రీమేక్ లో నటించనున్నారు.