Vikas Gupta: ఈ బాలీవుడ్‌ నిర్మాత బైసెక్సువల్‌, తనను ద్విలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్న బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వికాస్‌​ గుప్తా, గర్వంగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడి

బాలీవుడ్‌ నిర్మాత, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వికాస్‌​ గుప్తా (Vikas Gupta) పేరు వినే ఉంటారు. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటారా.. ట్విట్టర్లో (Twitter) ఆయన ఓ సంచలన ట్వీట్ చేశారు. తన జీవితం గురించి ఓ నిజాని బయటపెట్టారు. ఈ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వికాస్‌​ గుప్తా తాను బైసెక్సువల్‌ (I am bisexual) అని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

Vikas Gupta comes out as bisexual I fall in love regardless of gender (Photo-Vikas Gupta's Twetter)

బాలీవుడ్‌ నిర్మాత, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వికాస్‌​ గుప్తా (Vikas Gupta) పేరు వినే ఉంటారు. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటారా.. ట్విట్టర్లో (Twitter) ఆయన ఓ సంచలన ట్వీట్ చేశారు. తన జీవితం గురించి ఓ నిజాని బయటపెట్టారు. ఈ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వికాస్‌​ గుప్తా తాను బైసెక్సువల్‌ (I am bisexual) అని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తమిళనాడులో వైయస్ జగన్ హవా, విజయ్ బర్త్‌డే సంధర్భంగా పోస్టర్లలో ఏపీ సీఎం ఫోటో, విజయే రేపటి సర్కారును నిర్ణయించే సర్కార్ అంటూ క్యాప్షన్

ఆయన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేస్తూ.. ‘హాయ్‌.. నా గురించి మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ద్విలింగ సంపర్కుడిని. స్త్రీ, పురుష భేదం లేకుండా నేను ఎవరితోనైనా ప్రేమలో పడగలను. నాలాంటి వారు చాలామంది ఉన్నారు. నేను బైసెక్సువల్‌ అని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నాను. ఇందులో ఎవరి బెదిరింపులు లేవు. నన్ను నేను గుర్తించేందుకు సాయం చేసిన ప్రియాంకశర్మ, పార్థ్‌సంథాన్‌లకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనితో పాటు తన ఫోటోలను కూడా షేర్‌ చేశారు.

Here's Vikas Guppta  Tweet

ప్రస్తుతం ట్విట్టర్లో ఈ ట్వీట్‌ తెగ వైరలవుతోంది. చాలామంది నెటిజన్లు వికాస్‌ గుప్తా ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. అతడికి మద్దతు తెలుపుతున్నారు. ‘వికాస్‌ గుప్తా వాస్తవాన్ని అంగీకరించారు.. అతడిని ఎవరు ఎగతాళి చేయకూడదు. మీలాంటి వారు చాలా అరుదు.. మీకు మా మద్దతు ఎప్పుడు ఉంటుంది’ అంటూ ప్రశంసిస్తున్నారు.

దేవుడు సృష్టించిన విధంగానే నేనే అభివృద్ధి చెందానని, నా ప్రవర్తనపై కుటుంబ సభ్యులు అవమానంగా పీలయ్యారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. నా తల్లి, నా తోబుట్టువులు నన్ను ద్వేషించుకున్నారు. వారు నన్ను చూసి అవమానంగా ఫీలయ్యేవారు. కానీ నేను వారిని ప్రేమిస్తున్నాను. వారిని గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను. పార్థ్‌సంతాన్, ప్రియాంక శర్మలకు ధన్యవాదాలు. వారు నాకు చేసిన అవమానాల వల్ల నేను మరింత శక్తివంతంగా తయారయ్యాను. అని ట్విట్టర్లో అన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Chandrababu Speech in Assembly: అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే అందరం కలిసి కూటమిగా ఏర్పడ్డామని తెలిపిన సీఎం చంద్రబాబు

Delhi CM Rekha Gupta Oath: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. సిద్ధమైన రాంలీలా మైదానం, రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం, వివరాలివే

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ? ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత DGP ద్వారకా తిరుమలరావు, ఇంతకీ ఎవరీ హరీశ్ కుమార్ గుప్తా

Advertisement
Advertisement
Share Now
Advertisement