
Vjy, Feb 25: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన సభ కౌరవ సభ. కౌరవసభను గౌరవసభ చేశాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశా. గౌరవసభను అవమానించే పార్టీ ఇవాళ అసెంబ్లీలో లేకుండా పోయింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం ఎప్పుడూ చూడలేదు. సంప్రదాయాలను మరిచి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది మేం కాదు.. ప్రజలు. నిన్న వైసీపీ నేతలు కేవలం 11 నిమిషాలే సభలో ఉన్నారని అన్నారు
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2వేలు .. ఆ తర్వాత రూ.4వేలు చేశాం. దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు పింఛన్ ఇస్తున్నామన్నారు. పింఛన్ల రూపంలో ఏటా రూ.34వేల కోట్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. స్వార్థ ప్రయోజనాల కోసం మేం కలిసి పోటీ చేయలేదు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే లక్ష్యంతోనే కలిసి పోటీ చేశాం. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైంది. డబుల్ ఇంజిన్ సర్కార్ లేకుంటే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని భావించాం. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు అని తెలిపారు.
త్వరలో రైతు భరోసా అమలు చేస్తాం. రైతు భరోసా కింద కేంద్రం, రాష్ట్రం కలిసి రూ.20వేలు ఇస్తాం. మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకురూ.20వేలు అందిస్తాం. ఇచ్చిన హామీ మేరకు 16,384 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తాం. ఎంత మంది పిల్లలున్నా అందరికీ అమలు చేస్తాం. కేంద్ర పథకాలకు ఇచ్చిన గ్రాంట్‌ను కూడా గత ప్రభుత్వం వాడేసింది. జల్‌జీవన్ కోసం రూ.80వేల కోట్లు కావాల్సి ఉంటే.. గత ప్రభుత్వం కేవలం రూ.20వేల కోట్లు అడిగింది. అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తామని తెలిపారు.
గత ప్రభుత్వంలో రంగుల పిచ్చి ఎక్కువయ్యింది.. సర్వే రాళ్లపైనా బొమ్మలు వేసుకున్నారు. పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడమే మా లక్ష్యం. ఇళ్లు లేని పేదలకు ఐదేళ్లలో ఇళ్లు నిర్మిస్తాం. గ్రామీణ పేదలకు 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తాం. ఉగాది రోజున పీ-4 విధానాన్ని ఆవిష్కరిస్తాం. 20లక్షల ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వ బాధ్యత. రూ.6.50లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ పూర్తి చేశాం. తాజా పెట్టుబడుల ద్వారా 5లక్షల ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తాం’’అని సీఎం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. చేస్తోందన్నారు. కేంద్రమే సాయం చేసి ఉండకపోతే.. మనకు మరిన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవన్నారు.ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అసెంబ్లీలో సోమవారం జరిగిన పరిణామాలు ఒక చీకటి రోజు అని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే వ్యక్తిని.. తన రాజకీయ జీవితంలో చూడటం ఇదే తొలిసారిని సీఎం చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు.ప్రతిపక్ష హోదా డిమాండ్ ఏ విధంగా సబబు అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రతిపక్ష హోదా మేం ఇచ్చేది కాదు.. ప్రజలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పేర్కొ్న్నారు. మా స్వార్థ ప్రయోజనాల కోసం తాము కలవ లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే కూటమిగా ఏర్పడ్డామన్నారు.