
Vjy, Feb 25: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీకే దక్కాలని బీజేపీ ఫైర్‌బ్రాండ్, ప్రముఖ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy)తెలిపారు. ఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైఎస్సార్‌సీపీ(YSRCP)నే ఉంది. కాబట్టి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష(Principal Opposition) హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నా వైఎస్సార్‌సీపీకి ఆ హోదా దక్కాల్సిందే అని స్పష్టం చేశారు.
ఆయన మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూ అంశం(Tirupati Laddu Controversy) ముగిసిపోయింది. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరు.మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలి. నా నిర్ణయాలను పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు అని అన్నారు.
ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్‌ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.
YSRCP should be given opposition status
బిగ్ బ్రేకింగ్ న్యూస్
అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా వైఎస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి
-సుబ్రమణ్యస్వామి
ప్రతిపక్షంలో ఒక్క పార్టీనే ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తప్పు లేదు pic.twitter.com/03qViy7Ofg
— Rahul (@2024YCP) February 25, 2025
ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయడ్డారు.ఆయన వేసిన పిల్ మార్చి 12వ తేదీన విచారణకు రానుంది.