Dadas of Hyderabad: వర్మ మరో బాంబు, హైదరాబాద్ దాదాగిరిపై తదుపరి సినిమా,హీరోగా జార్జిరెడ్డి ఫేం సందీప్ మాధవ్, హైదరాబాద్‌లో 1980లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా

సంచలనాలకు కేంద్ర బిందువైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma) తన స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలను పట్టాలు ఎక్కిస్తున్నాడు. ఇప్పటికే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ (Kamma Raajyam lo Kadapa Redlu) విడుదలకు సిద్ధమవుతుండ గానే ఈలోపు మరో సినిమాను ప్రకటించాడు. జార్జిరెడ్డి (George Reddy)సినిమాలో హీరోగా నటిస్తోన్న సందీప్ మాధవ్ (Sandeep Madhav) హీరోగా ఓ సంచలన చిత్రం చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

ram-gopal-varma-new-film-on-hyderabad-dadas (Photo-Twitter)

Hyderabad, November 19: సంచలనాలకు కేంద్ర బిందువైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma) తన స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలను పట్టాలు ఎక్కిస్తున్నాడు. ఇప్పటికే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ (Kamma Raajyam lo Kadapa Redlu) విడుదలకు సిద్ధమవుతుండ గానే ఈలోపు మరో సినిమాను ప్రకటించాడు. జార్జిరెడ్డి (George Reddy)సినిమాలో హీరోగా నటిస్తోన్న సందీప్ మాధవ్ (Sandeep Madhav) హీరోగా ఓ సంచలన చిత్రం చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టుల మీద సినిమాలు తీసిన నేను..హైదరాబాద్ దాదాలపై(Dadas of Hyderabad) ఓ సినిమా చేస్తున్నాని వర్మ తన ట్విట్టర్‌లో తెలిపాడు.

హైదరాబాద్‌లో 1980లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా ఉంటుందని ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమాలో నటించడానికి సందీప్ మాధవ్ సంతకం కూడా చేశాడని వర్మ పేర్కోన్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వంగవీటి’ సినిమా వచ్చిన సంగతి తెల్సిందే. సందీప్ మాధవ్ తాజాగా నటించిన జార్జిరెడ్డి సినిమా ఈ నెల 22 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

వర్మ న్యూ మూవీ

దాదాస్ ఆఫ్ హైదరాబాద్ అంటూ సినిమాకి సంబంధించిన పాయింట్ ని బయటపెట్టాడు. నా శివ(SHIVA) సినిమా లాగా ఈ చిత్రంని కూడా కొన్ని రియ‌ల్ లైఫ్ క్యారెక్టర్స్ ఆధారంగా తెర‌కెక్కిస్తాను అని వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన విడుద‌లైన ప‌లు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా, రేపు ఉద‌యం( నవంబ‌ర్ 20) 9.36ని.ల‌కి చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట‌ర్ షేర్ చేస్తూ తెలిపాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement