Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం, హైపర్ ఆది కుట్ర చేస్తున్నాడా, అసలు మల్లెమాలలో ఏం జరుగుతోంది, సంక్రాంతికి షాకింగ్...

ఢీ ని ఎంతో సక్సెస్ చేసిన సుధీర్‌ ను తొలగించారు. ఢీ కొత్త సీజన్ లో సుధీర్‌ లేడు. కొత్త వారు వచ్చేశారు. అయితే వారు ఎంటర్‌ టైన్ చేయలేక పోతున్నారని నెటిజన్లు ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

Sudheer (Image: Twitter)

సుడిగాలి సుధీర్ అంటేనే జబర్దస్త్...జబర్దస్త్ అంటేనే సుధీర్...ఒక మెజీషియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుధీర్ ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా ఏకంగా స్టార్ రేంజ్ అందుకున్నాడు. అయితే సుధీర్‌ ను ఈమద్య కాలంలో మల్లెమాల వారు పక్కకు పెడుతున్నారా అంటే ఔను అనే సమాదానం వినిపిస్తుంది. మల్లెమాల వారు చేస్తున్న షో ల్లో సుధీర్‌ ను పక్కకు పెడుతున్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే ప్రస్తుతం సుధీర్‌ కనిపిస్తున్నాడు. ఢీ ని ఎంతో సక్సెస్ చేసిన సుధీర్‌ ను తొలగించారు. ఢీ కొత్త సీజన్ లో సుధీర్‌ లేడు. కొత్త వారు వచ్చేశారు. అయితే వారు ఎంటర్‌ టైన్ చేయలేక పోతున్నారని నెటిజన్లు ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఢీ అంటే ఎంటర్ టైన్మెంట్‌ కోసమే చాలా మంది సుధీర్‌ ఉన్నప్పుడు చూసేవారు. ఇప్పుడు సుధీర్ లేడు కనుక డాన్స్ లేదు ఎంటర్‌ టైన్మెంట్‌ లేదు ఎందుకు ఢీ ని చూడటం అని సుధీర్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఢీ ఎంత పాపులర్ అయినా కూడా సుధీర్‌ ఉంటేనే చూస్తాం అన్నట్లుగా ప్రేక్షకులు మారారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ ఈవెంట్‌ లో కూడా సుదీర్ కనిపించడం లేదు. ప్రతి సారి పండుగ ఈవెంట్‌ లో సుధీర్‌ హైలైట్‌ అవుతూ వస్తుంటాడు. కాని ఈసారి మాత్రం సుధీర్ కనీసం కనిపించడం లేదు. సుధీర్ ఈసారి కూడా లేక పోవడంతో మల్లెమాల వారికి సుధీర్‌ కు మద్య ఏదో జరుగుతుంది. అందుకే ఢీ నుండి తప్పించారు.. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి మెల్ల మెల్లగా తొలగిస్తున్నారు. ఇదే సమయంలో జబర్దస్త్‌ నుండి కూడా ఆయన్ను తొలగించారు అంటూ విమర్శలు వస్తున్నాయి. సుధీర్‌ ను కనుక మల్లెమాల నుండి తప్పిస్తే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయంటూ అభిమానులు హెచ్చరిస్తున్నారు.

Tata Tiago CNG Price And Features: పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని చింతిస్తున్నారా, టాటా నుంచి CNG కారు ఈ నెల 19న విడుదలకు సిద్ధం..

 

సుధీర్‌, మల్లెమాల టీవీ వారు కలిసి ఉంటేనే ప్రేక్షకులు ఎంటర్‌ టైన్మెంట్‌ ను దక్కించుకుంటారు. అలా కాదని సుధీర్‌ ను తొలగిస్తే మాత్రం ఈటీవీ మసక బారడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్‌ ను బంగారు బాతు అంటారు. అలాంటి బంగారు బాతు కోసం స్టార్‌ మా, జీ తెలుగు రెండు కోరుకుంటున్నాయి. కనుక ఒక వేళ మల్లెమాల కనుక సుధీర్‌ ను వదిలేస్తే అక్కడ ఎంజాయ్‌ గా సుధీర్ చేరుతాడు. సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ లో మరింత ముందుకు వెళ్తాడు అనే టాక్ వినిపిస్తుంది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif