crime-scene (Rep Image)

Kerala Shocker: మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి.. శారీరక సుఖం కోసం వావివరసలు మర్చిపోయి కొంతమంది రెచ్చిపోతున్నారు. ఫలితంగా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. తాజాగా 50 సంవత్సరాలు దాటిన ఓ మహిళ తన కన్న కొడుకు ముందే పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని శృంగారంలో తేలియాడింది. ఇది గమనించిన ఆ యువకుడు కన్నతల్లి అలా చేయడం చూసి తట్టుకోలేక పోయాడు.. అతడు తట్టుకోలేక ఏం చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పూర్తి వివరాల్లోకి వెళితే, కేరళలోని అలప్పుజలో, 54 ఏళ్ల కుంజుమాన్, 50 ఏళ్ల అశ్వమ్మ వారి 28 ఏళ్ల కుమారుడు కిరణ్‌తో సంతోషంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి జీవితంలోకి ఒక అనుకోని సంఘటన అనేక విభేదాలకు దారితీసింది. అశ్వమ్మ అనే ఆ మహిళ తన పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె భర్త, కొడుకు ఈ విషయం గురించి తెలుసుకున్నారు. అశ్వమ్మ తన ఇంటి పక్కనే నివసించే 53 ఏళ్ల దినేష్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చాలా రోజులుగా ఈ విషయం రెండు కుటుంబాలకు తెలియకుండానే దాగి ఉంది. అయితే, అశ్వమ్మ భర్త, కొడుకు ఈ విషయం తెలుసుకున్న తర్వాత, ఆ విషయాన్ని అక్కడితో ఆపమని పక్కింట్లోని దినేష్ ను హెచ్చరించారు. అయినప్పటికీ అతని వారి మాటలను దినేష్ చెవికి ఎక్కించుకోలేదు. అశ్వమ్మతో తన సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో దినేష్ కు బుద్ధి చెప్పాలని కిరణ్ ప్లాన్ చేసుకున్నాడు.

దినేష్ ఎప్పుడూ తన తల్లి అశ్వమ్మను కలవడానికి ఇంటి వెనుక నుండి వస్తాడని కిరణ్ కు తెలుసు. కాబట్టి అతను దీన్ని సద్వినియోగం చేసుకుని ఇంటి వెనుక విద్యుత్ వైర్లను ఏర్పాటు చేశాడు. ఇంటి వెనుక నుండి అశ్వమ్మను కలవడానికి వచ్చిన దినేష్ కాలు విద్యుత్ తీగలపై పడి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం దినేష్ మృతదేహాన్ని, కిరణ్, అతడి తండ్రి కుంజుమాన్ కలిసి మాయం చేసే ప్రయత్నం చేశారు.

ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 8న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో దినేశన్ మృతదేహం అతని ఇంటికి సమీపంలోని వరి పొలంలో కనిపించింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. నిందితుడు కిరణ్ ను పోలీసుల కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసుల సమగ్ర దర్యాప్తులో దినేష్ మరణానికి గల కారణలు బయటపడ్డాయి. పోలీసులు కిరణ్, కుంజుమాన్ లను అరెస్టు చేశారు